ట్రైనీ కానిస్టేబుళ్లకు చంద్రబాబు గుడ్ న్యూస్..! కొత్త ఏడాది వేళ జీవో జారీ..!
ఏపీలో శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు కొత్త ఏడాది వేళ కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్త ఏడాదిలో వారు శిక్షణను మరింత సంతోషంగా పూర్తి చేసుకునేందుకు వీలు కలగబోతోంది. అలాగే విధుల్లోకి చేరకముందే వారికి ఉత్సాహం లభించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
శిక్షణకు ఎంపికైన కానిస్టేబుళ్లకు ఇచ్చే స్టయిఫండ్ ను పెంచుతామని ఇప్పటికే సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన మేరకు శిక్షణలో ఉన్న కాబోయే కానిస్టేబుళ్లకు ప్రస్తుతం ఉన్న రూ.4500 స్టయిఫండ్ కాస్తా 12 వేల రూపాయలకు చేరబోతోంది. గతంలో 2008లో 3 వేలుగా ఉన్న స్టయిఫండ్ కాస్తా 4500కు పెంచారు. ఇప్పుడు దాన్ని 12వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు ట్రైనింగ్ లో ఉన్న కానిస్టేబుళ్లకు ఈ పెంపు వర్తింపచేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ఈ పెంపును తక్షణం అమల్లోకి తీసుకురాబోతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు జనవరి 1 న ఇచ్చే స్టయిఫండ్ లో ఈ పెంపు అమలు చేయబోతున్నారు. ఇక్కడి నుంచి ప్రతీ నెలా వారికి 12 వేల రూపాయలు స్టయిఫండ్ గా అందబోతోంది.












Click it and Unblock the Notifications