ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ఖరారు- ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే ?

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు ఖరారయ్యాయి. వచ్చే నెలలో ఎస్1 పరీక్షలు నిర్వహించిన తర్వాత స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పరీక్షలతో పాటు దసరా సెలవుల తేదీల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే నెల 5 నుంచి పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత సెలవులు ఉండబోతున్నాయి. ఈసారి 11 రోజుల పాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి 11వ తేదీ వరకూ ఎస్ఏ1 పరీక్షలు నిర్వహించబోతున్నారు. అనంతరం అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 14 నుంచి సెలవులు ఇస్తామని ప్రకటించినా, తాజాగా ఒక రోజు ముందుగానే అంటే 13నే సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ సెలవులు అక్టోబర్ 25 వరకూ కొనసాగుతాయి.

ap government release dussehra holidays schedule for schools-here are details

అక్టోబర్ 5 నుంచి 11 వరకూ జరిగే ఎస్ఏ1 పరీక్షల్లో 8వ తరగతి విద్యార్ధులకు మినహా మిగతా అన్ని తరగతులకూ ఉదయం పూటే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్షలు 11న ముగియగానే మధ్యలో ఓ రోజు విరామం ఇచ్చి అనంతరం 13వ తేదీ నుచి 25 వ తేదీ వరకూ దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం అక్టోబర్ 26న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు అన్ని పాఠశాలలకు సర్కులర్ పంపుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో రెండేళ్ల పాటు కరోనా కారణంగా విద్యాసంవత్సరాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో సెలవులపైనా ప్రభావం పడింది. కానీ ఈ ఏడాది మాత్రం అలాంటి ఇబ్బందులు ఏవీ లేకపోవడంతో విద్యాసంవత్సరం సాఫీగా సాగిపోతోంది. దీంతో విద్యార్ధులకు దసరాతో పాటు ఇతర సెలవులు కూడా షెడ్యూల్ ప్రకారమే ఇవ్వబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+