ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల-ముఖ్యమైన తేదీలివే
ఏపీలో ఈ విద్యాసంవత్సరం పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై ప్రభుత్వం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. కర్నూల్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ ఈ షెడ్యూల్ న విడుదల చేశారు. ఇందులో పలు వివరాలు ఉన్నాయి.
ఏపీలో పదో తరగతి పరీక్షలను మే 2 నుంచి 13వ తేదీ వరకూ నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరిక్షలు రాయనున్నారని తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలను ఏప్రిల్ 8 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరిక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్ బోర్డు పరిక్షలు జరుగుతాయని సురేష్ తెలిపారు.1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరిక్షలు రాయనున్నారు.

పదో తరగతి షెడ్యూల్
మే 2 - ఫస్ట్ లాంగ్వేజ్
మే 4- సెకండ్ లాంగ్వేజ్
మే 5- ఇంగ్లీష్
మే 7- మ్యాథ్స్
మే 9- ఫిజిక్స్
మే 10- బయోలజీ
మే 11- సోషల్ స్టడీస్
మే 12 - ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్), ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1, ఒకేషనల్ కోర్స్
మే 13 - ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2, ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్టు (థియరీ)












Click it and Unblock the Notifications