ఇఫ్తార్ విందుకు పవన్ కల్యాణ్ దూరం..?

ఏపీ ప్రభుత్వం ఈ నెల 27న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ నెల(మార్చి) 27వ తేదీన విజయవాడ(Vijayawada)లోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసే రాష్ట్రస్థాయి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమాలకు ఎలాంటి నిధుల కొరత లేదని అధికారులు తెలిపారు. ఈ విందు కోసం ఆహారంలో నాణ్యత, ప్రోటోకాల్, సౌకర్యాల కల్పనలో అధికారులు ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని తెలిపారు.ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు డిప్యూటీ సీఎం హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం పేరిట దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికి అయినా రెడీ అంటూ గతంలో పవన్ కల్యాణ్ ప్రకటించారు.

AP government releases funds for Iftar

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందని ఆయన 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తిరుపతిలో వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారాయన. తాను బలమైన సనాతన ధర్మం పాటించేవాడనని ఆయన చెప్పుకొచ్చారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించడంతో పాటు, వాటికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా కోరారు. హిందూ ధర్మం గురించి ఇంత చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , ఇప్పుడు ముస్లిం పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తోన్న ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొంటారా లేదా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పర్వాలేదు.కానీ ఆయన ఓ పార్టీకి రాజకీయ ప్రతినిధిగా తన పార్టీలోని ముస్లిం కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తారా అన్నది చూడాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+