సచివాలయాల ఉద్యోగులకు కీలక అప్జేట్..! అంతర్ జిల్లా బదిలీలు ఇలా ..!

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుుత్వం ఇవాళ మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అంతర్ జిల్లా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో ఈ బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు బదిలీలు ఎలా చేయాలనే దానిపై ఈ మార్గదర్శకాలు స్పష్టత ఇచ్చేలా ఉన్నాయి. వీటి ఆధారంగా ఉద్యోగులకు బదిలీలు చేపట్టనున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు స్పౌజ్ (భార్య-భార్త) కేటగిరీ కింద అంతర్ జిల్లాల బదిలీలు కోరుకుంటే వారిని బదిలీ చేసేందుకు అనుమతి ఇచ్చారు. దరఖాస్తులు మాత్రం ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా సమర్పించాలి.నియామక యూనిట్ అయిన పాత జిల్లాలే ట్రాన్స్‌ఫర్ యూనిట్లుగా గుర్తించారు. సంబంధిత హెచ్వోడీు తమ హోదాలకు సంబంధించిన ఖాళీల జాబితాను ప్రకటించాలి. ఉద్యోగులు తమకు కావాల్సిన మండలాలు/పట్టణ స్ధానిక సంస్థల్ని ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. కేసులున్న వారికి మాత్రం బదిలీలలో మినహాయిస్తారు. అలాగే బదిలీ కోరుకుంటున్న వారు ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ నుంచి తప్పనిసరిగా బకాయిలు లేవని ధృవపత్రం తీసుకోవాలి.

AP Government Releases Guidelines for Inter-District Transfers of Secretariat Employees

అలాగే ఇలాంటి బదిలీ అభ్యర్ధన కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే పరిగణిస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, పీఎస్యూలు, రాష్ట్ర యూనివర్సిటీలు, మున్సిపాలిటీలు, సహకార సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, కేంద్ర యూని వర్సిటీలు, కేంద్ర సంస్థల్లోకి మాత్రమే అనుమతిస్తారు. అలాగే భర్త/భార్యలో ఒకరు ప్రైవేట్ ఉద్యోగి అయితే అర్హత లేదు. ఈ బదిలీలకు భార్య-భర్త వివాహ ధృవీకరణ పత్రం, భర్త/భార్య ఉద్యోగ ధృవీకరణ పత్రాలు సమర్పించాలి.

మరోవైపు అంతర్ జిల్లా బదిలీలు ఖాళీలు ఉన్నప్పుడే జరుగుతాయి. బదిలీ అయిన ఉద్యోగికి ఆ జిల్లాలో చివరి ర్యాంక్ ఇస్తారు.
అభ్యర్థులను మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీరియల్‌గా అమర్చుతారు. టై అయితే సర్వీస్ సీనియారిటీ, జన్మతేది ప్రామాణికంగా తీసుకుంటారు. బదిలీ ప్రక్రియ ఆన్ లైన్ లోనే జరుగుతుంది. బదిలీలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నాక ఎంపీడీవో, కమిషనర్ ధృవీకరిస్తారు. ఆ తర్వాత తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించి ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు. అభ్యంతరాలు ఉంటే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసే అవకాశం ఇస్తారు.

AP Government Releases Guidelines for Inter-District Transfers of Secretariat Employees

అలాగే జిల్లాల మధ్య ఉద్యోగుల బదిలీలు సంబంధిత శాఖ సెక్రటరీలు చేస్తారు.వీరు GA(MC-I) ద్వారా ప్రతిపాదనలు పంపాలి.
మొదట పోర్టల్‌లో మండల/పట్టణ స్ధానిక సంస్థ కేటాయింపు ఉంటుంది.తరువాత కౌన్సెలింగ్ ద్వారా సచివాలయం కేటాయిస్తారు. తుది ఆర్డర్లు కలెక్టర్లు/RDMA వంటి అపాయింటింగ్ అథారిటీల ద్వారా చేస్తారు. ఇందుకు సచివాలయాల్లో ఏ,బీ,సీ కేటగిరీ ప్రకారం 6/7/8 మంది సిబ్బంది ఉండేలా కలెక్టర్లు చూసుకోవాలి. తప్పుడు సమాచారం/పత్రాలు సమర్పించిన ఉద్యోగి & సర్టిఫై చేసిన అధికారి ఇద్దరికీ శిక్షా/క్రిమినల్ చర్యలు ఉంటాయి.టీటీఏ, డీఏ, జాయినింగ్ టైం ఇవ్వరు. మొత్తం బదిలీల ప్రక్రియ 30-11-2025 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+