ఏపీలో 130 కోవిడ్ కేసులు ! అన్నీ అవే - జగన్ సర్కార్ కీలక ప్రకటన..
చైనాలో కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాల్ని అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. కేంద్రం సూచనల నేపథ్యంలో రాష్ట్రాలు కూడా కోవిడ్ పరిస్ధితిని సమీక్షిస్తున్నాయి. అలాగే కోవిడ్ టెస్టుల సంఖ్యను కూడా పెంచుతున్నాయి. దీంతో కేసులు కూడా బయటపడుతున్నాయి.
ఏపీలో కోవిడ్ తాజా పరిస్దితిపై ప్రభుత్వం వైద్యఆరోగ్యశాఖ ఇవాళ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ తెలిపారు. నిరంతరం
పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ నెల నుండి దాదాపు 30 వేల శ్యాంపిళ్లు టెస్ట్ చేయగా 130 పాజిటివ్ కేసులొచ్చాయని ఆయన తెలిపారు. ఓమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదని నివాస్ వెల్లడించారు.

రాష్ట్రంలో సేకరించిన శాంపిల్స్ ను జినోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో వున్నాయని కమీషనర్ జె.నివాస్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ , ఐసియు బెడ్లు సిద్ధంగా వుంచామన్నారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ,మందులు కూడా అందుబాటులో వున్నాయన్నారు.
వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో నిరంతర పర్యవేక్షణ వుంటుందన్నారు. కేంద్రం తాజా హెచ్చరికలనేపథ్యంలో రాష్టంలో కోవిడ్ పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications