వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నాడు నేడు' తో మార్పు ; ప్రతిపక్షాలకు జగన్ చెక్ : స్కూల్స్ రూపు రేఖలు మార్చి మరో ముందడుగు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాలనలో తనదైన మార్క్ చూపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు. అందులో భాగంగా సంచలన నిర్ణయాలు తీసుకొని తనదైన మార్కు పాలన సాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనను, ప్రస్తుత ప్రభుత్వ పాలనను స్పష్టంగా బేరీజు వేసుకునేలా, ప్రజలు నేరుగా తమ కళ్ళతో నేరుగా చూసి అర్థం చేసుకునేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

చంద్రబాబు అంతు చూస్తామని చిటికెలేస్తాడు.. లోకేశం విందు భోజనాలు ఆరగించి వస్తాడు : సాయిరెడ్డి వ్యంగ్యంచంద్రబాబు అంతు చూస్తామని చిటికెలేస్తాడు.. లోకేశం విందు భోజనాలు ఆరగించి వస్తాడు : సాయిరెడ్డి వ్యంగ్యం

స్కూల్స్ స్వరూపం సమూలంగా మార్చేసిన జగన్

స్కూల్స్ స్వరూపం సమూలంగా మార్చేసిన జగన్

ఒకప్పుడు శిధిలమైన భవనాలు, పెచ్చులూడిన గచ్చులు, విరిగిపోయిన బల్లలు, వర్షం పడితే విద్యార్థులంతా ఒక మూల కూర్చునేలా కురుస్తున్న గదులతో ప్రభుత్వ పాఠశాలలు దర్శనమిచ్చేవి. పాఠశాలలలో అపరిశుభ్ర వాతావరణం ఉండేది. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితులు విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసేవి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చదువుకోవడం అంటేనే అరకొర వసతులతో చదువుకోలేని ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. కానీ ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ లుక్ సొంతం చేసుకున్నాయి. పాఠశాలల రూపురేఖలు మార్చడంతో నూతన ఒరవడిని సృష్టించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఉన్న పాఠశాలల స్వరూపానికి, ఇప్పుడు పాఠశాల స్వరూపానికి తేడాను స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చేసి చూపించారు.

 మొదటి విడతలో కార్పోరేట్ లుక్ తో 15,715 స్కూల్స్

మొదటి విడతలో కార్పోరేట్ లుక్ తో 15,715 స్కూల్స్

రాష్ట్ర వ్యాప్తంగా 44,512 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడానికి రంగంలోకి దిగిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి విడతగా 15,715 పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో రూపురేఖలు మార్చేశారు. అధునాతన సౌకర్యాలతో, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల భవనాలను మార్చేశారు. మొత్తం 15,715 పాఠశాలలకు 3,585 కోట్ల రూపాయలను కేటాయించి అభివృద్ధి చేశారు. పాఠశాలల భవనాలను రిపేర్ చేయించడమే కాకుండా, ఆధునికత ఉట్టిపడేలా, విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా చాలా అందంగా తీర్చిదిద్దారు. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించడానికి కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా అయితే పాఠశాలలను రెడీ చేస్తున్నాయో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను సైతం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

విద్యా ప్రమాణాల మెరుగుదలకు సీఎం జగన్ పక్కా ప్రణాళిక

విద్యా ప్రమాణాల మెరుగుదలకు సీఎం జగన్ పక్కా ప్రణాళిక

పాఠశాలల్లో విద్యార్థులకు గాలి, వెలుతురు దారుణంగా వచ్చేలా తరగతి గదులు, బ్లాక్ బోర్డ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా గార్డెన్స్, ప్లే గ్రౌండ్స్, అపరిశుభ్ర వాతావరణం లేకుండా ఉండేలా టాయిలెట్స్ ఇలా ఒకటేమిటి సర్వాంగ సుందరంగా పాఠశాలలు ముస్తాబయ్యాయి. దేశానికి ఎంతో మంది ప్రముఖులను, మంత్రులను అందించిన అనేక ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకుని అభివృద్ధికి నోచుకోక, దయనీయమైన పరిస్థితుల్లో దర్శనమిచ్చేవి. కానీ అలాంటి పాఠశాలలకు సైతం జగన్ సంకల్పంతో మోక్షం లభించింది. అన్ని స్కూల్స్ అందంగా ముస్తాబవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలతో, పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన జగన్ అడుగడుగున విద్యార్థులకు కావలసిన వసతులను సమకూరుస్తూ ఏపీలో విద్యార్థులను సర్కారీ బడి బాట పట్టిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16 నుండి స్కూల్స్ .. నాడు నేడు ద్వారా కొత్తగా మారిన స్కూల్స్

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16 నుండి స్కూల్స్ .. నాడు నేడు ద్వారా కొత్తగా మారిన స్కూల్స్

చిన్నారుల బంగారు భవితకు బాటలు వేసేలా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 16వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలలన్నీ ముస్తాబై విద్యార్థులకు స్వాగతం చెప్పడానికి రెడీ అవుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ ప్రజాప్రతినిధులు తమ తమ జిల్లాల పరిధిలో ఉన్న పాఠశాలలపై ప్రత్యేకమైన దృష్టి సారించి, స్వయంగా పర్యవేక్షించి మరీ నాడు-నేడు పనులు పూర్తి చేయించారు.ఇప్పటికే అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల చదువుకు ప్రాధాన్యతనిస్తున్న జగన్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ నుండి ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు తెలుస్తుంది.

చంద్రబాబు హయాంలో స్కూల్స్ .. ఇప్పుడు స్కూల్స్ .. ఇదే తమ పని తీరు అని చెప్పే యత్నం

చంద్రబాబు హయాంలో స్కూల్స్ .. ఇప్పుడు స్కూల్స్ .. ఇదే తమ పని తీరు అని చెప్పే యత్నం

అంతేకాదు చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని చూపించే యత్నం చేస్తున్నారు అధికార వైసీపీ నాయకులు . విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి, ప్రభుత్వ పాఠశాలలను బాగుచేయడానికి ఏ రకమైన ప్రయత్నాలు జరగలేదని, నాడు నేడు ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని భావించారు సీఎం జగన్. అప్పుడు విద్యార్థులు అరాకొరా వసతులతో అడుగడుగునా పడిన ఇబ్బందులను నాటి స్కూల్స్ కళ్ళకు కట్టాయి. నాటి శిధిలమైన పాఠశాలల ఫోటోలను ప్రస్తుతం కొత్త కళను సంతరించుకున్న కార్పొరేటర్ స్టైల్లో రూపుదిద్దుకున్న పాఠశాలల ఫోటోలను స్థానిక ప్రజలకు అర్థమయ్యేలా చూపిస్తూ ఎవరి పాలన ఎలా ఉందో ప్రజలే బేరీజు వేసుకునేలా చేశారు.

నాడు నేడు ద్వారా టీడీపీకి చెక్ పెట్టటంలో జగన్ సక్సెస్ .. విద్యా వ్యవస్థలో మార్పు జగన్ వల్లే

నాడు నేడు ద్వారా టీడీపీకి చెక్ పెట్టటంలో జగన్ సక్సెస్ .. విద్యా వ్యవస్థలో మార్పు జగన్ వల్లే


నాడు నేడు ద్వారా పాఠశాల విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పును చూపించాలని భావించిన జగన్ మొదటి విడత నాడు-నేడు లోనే సక్సెస్ అయినట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో జగన్ సర్కారు తీసుకుంటున్న అనేక నిర్ణయాలపైన నిత్యం విరుచుకుపడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, నాడు నేడు విషయంలో సైలెంట్ గా ఉండిపోయారు. ఈ విషయంలో ఏపీ సర్కార్ ను టార్గెట్ చేయలేకపోతున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ ఈ విషయంలో ప్రతిపక్షాలకు చెక్ పెట్టి మరీ ముందడుగు వేశారు.

English summary
The look of schools has changed since Jagan Mohan Reddy took over as AP CM. Government schools have acquired a corporate look. AP CM Jagan Mohan Reddy, who created a new trend by changing the look of schools, made it clear to the people the difference between the appearance of schools under the previous government and the appearance of schools now. Jagan targeted opposition with this program. Jagan, who wanted to show change in the school education system through today, seems to have succeeded in the first phase of Nadu nedu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X