ఏపీకి కొత్త డీజీపీ ఎవరు ? యూపీఎస్సీకి ఐదు పేర్లు పంపిన ప్రభుత్వం..!
ఏపీలో ఇన్ ఛార్జ్ డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా స్ధానంలో కొత్త డీజీపీ ఎంపిక కోసం కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇవాళ ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను యూపీఎస్సీకి పంపింది. ఇందులో మూడు పేర్లను ఎంపిక చేసి తిరిగి యూపీఎస్సీ ప్రభుత్వానికి పంపుతుంది. ఇందులో నుంచి ఒక అధికారిని ప్రభుత్వం డీజీపీగా నియమించే అవకాశం ఉంది. దీంతో కొత్త డీజీపీ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
గతంలో డీజీపీగా పనిచేసిన ద్వారకా తిరుమల రావు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం కొత్త డీజీపీ ఎంపిక చేయాల్సి ఉంది. ఇందుకోసం యూపీఎస్సీకి పేర్లు పంపడానికి సమయం లేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలిక డీజీపీగా హరీష్ గుప్తాను నియమించింది. గతంలో ఎన్నికల సమయంలోనూ హరీష్ గుప్తాను ఈసీ ఓసారి డీజీపీగా నియమించింది. దీంతో హరీష్ గుప్తాను ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఆయనతో పాటు మొత్తం ఐదు పేర్లను యూపీఎస్సీకి పంపింది.

రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీ ఎంపిక కోసం యూపీఎస్సీకి పంపిన పేర్లలో సీనియర్ ఐపిఎస్ లు మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్ర నాధ్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్. సుబ్రహ్మణ్యం ఉన్నారు.వీరిలో ముగ్గురిని కేంద్రం ఎంపిక చేసి తిరిగి పంపనుంది. అప్పుడు వారిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా ఎంచుకునే అవకాశాలున్నాయి. అప్పుడు ఆయన్ను కొత్త డీజీపీగా నియమించనున్నారు. ఎలాగో కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వమే ఉండటంతో ప్రభుత్వ ఛాయిస్ మేరకే డీజీపీ ఎంపిక ఉండొచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications