బోటు ప్రమాదం: లైసెన్సులన్నీ రద్దు, ఏడుగురిపై వేటు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కృష్ణా నదిలో బోటు మునిగిన ప్రమాదంలో ఏడుగురిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వేటేసింది. ఈ ప్రమాదంలో ఐఎఎస్ అధికారులున్నా చర్యలకు వెనుకాడబోమని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైసెన్సులను కూడ రద్దు చేసింది.ఆదివారం నాడు కృష్ణానదిలో ఫెర్రీ వద్ద బోటు మునిగిన ప్రమాదంలో 22 మంది మరణించారు.

  Krishna Boat Tragedy : Shocking Facts, తీగ లాగితే డొంకంతా కదిలింది | Oneindia Telugu

  బోటు ప్రమాదం: సాగర్ టూ శ్రీశైలం బోట్ల రద్దు, ''బాబు షూ వల్లే ఇదంతా''..

  కృష్ణా నదిలో బోటు మునిగిన ప్రమాదంలో 22 మంది మరణించారు. అయితే మరణించిన వారిలో 17 మంది ఒంగోలు పట్టణానికి చెందినవారే ఉన్నారు.

  బోటు ప్రమాదం: డ్రైవర్ గేదేల శ్రీనుపై వేటు, నిర్లక్ష్యమే కారణం

  భవిష్యత్‌లో ఈ తరహ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. పర్యాటక శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందనే ఆరోపణలు కూడ వెల్లువెత్తుతున్నాయి.

   బోటు ప్రమాదంపై ఏడుగురిపై వేటు

  బోటు ప్రమాదంపై ఏడుగురిపై వేటు

  ఫెర్రీ వద్ద జరిగిన బోటు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది. ఘటన జరిగిన మరునాడే బోటు డ్రైవర్ గేదేల శ్రీనివాస్‌ను ఉద్యోగం నుండి తప్పించారు.ఈ ఘటన తర్వాత పర్యాటక శాఖలో ఏడుగురు ఉద్యోగులపై ప్రభుత్వం వేటేసింది. కీలకమైన అధికారులపై కూడ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఔట్ సోర్సింగ్ ‌లో పనిచేస్తున్న వారిని కూడ ఉద్యోగం నుండి తొలగించారు. పర్యాటక శాఖలో అసిస్టెంట్ ఏజీఎం రామకృష్ణ, డిప్యూటీ మేనేజర్ గంగరాజు, గ్రేడ్ 1 స్విమ్మర్ వీరారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర్, ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న నర్సింహ్మరావు, చెంచెంరాజు, శ్రీనివాసరావులను కూడ ఉద్యోగాల నుండి తొలగించారు.

  ఐఎఎస్ అధికారులున్నా చర్యలు

  ఐఎఎస్ అధికారులున్నా చర్యలు

  ఫెర్రీ ఘటనపై ఎంత పెద్ద అధికారులున్నా చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తోంది. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే ప్రాథమికంగా వచ్చిన నివేదికల ఆధారంగా ఈ ఏడుగురిపై చర్యలు తీసుకొన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

   లైసెన్సుల రద్దు

  లైసెన్సుల రద్దు

  ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని బోటు యజమానులతో సమావేశాన్ని మంగళవారం నాడునిర్వహించింది. ఈ సమావేశంలో ఫెర్రీ తరహ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. అంతేకాదు బోటు లైసెన్సులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వం రాష్ట్రంలో బోటు యజమానులకు లైసెన్సులను జారీ చేయనుంది. లైసెన్సుల జారీ కోసం కూడ పకడ్బందీ వ్యూహలను అనుసరించనుంది.

   ఫెర్రీ ఘటన జల రవాణాకు విఘాతం

  ఫెర్రీ ఘటన జల రవాణాకు విఘాతం

  ఏపీ ప్రభుత్వం జల రవాణాపై కేంద్రీకరించింది. ఈ సమయంలో ఫెర్రీ ఘటన ఏపీ రాష్ట్రానికి ఇబ్బందులను తెచ్చి పెట్టింది. జల రవాణా ద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఈ సమయంలోనే ఫెర్రీ ఘటన ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చి పెట్టింది. దీంతో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకొంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ap government suspended seven employees of APTDC for Ferry boat accident.Ap tourism minister Bhuma Akhilapriya spoke to media on Wednesday at Amaravati.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి