AP Pensions: పింఛన్ దారులకు గుడ్ న్యూస్..!

ఏపీలో పెన్షన్ల పంపిణీలో ఈసారి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ అయిన వారికి వాటిలోనే క్రెడిట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే బ్యాంకులకు రాలేని వారికి ఇళ్ల వద్దే పంపిణీ చేస్తోంది. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బ్యాంకులకు వెళ్లి వీరు పెన్షన్లు తీసుకోవడం కూడా కష్టంగా మారుతోంది. దీంతో వారి ఇబ్బందులు వర్ణనా తీతంగా ఉన్నాయి. అలాగే ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీకి ఎంపిక చేసిన వారికి కూడా ఇప్పటికీ అందలేదు.

ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల్లో ఇప్పటివరకూ పెన్షన్ మొత్తం క్రెడిట్ కాని వారికి రేపటి నుంచి ఇళ్ల వద్దే పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మేరకు బ్యాంకుల నుంచి పెన్షన్ల మొత్తాన్ని విత్ డ్రా చేసి రేపటి నుంచి ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు పంపుతోంది. దీంతో రేపటి నుంచి ఈ ప్రక్రియ మొదలు కానుంది. ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం హైబ్రిడ్ మోడ్ లో పెన్షన్ పంపిణీ చేపట్టినా ఇందులోనూ తలనొప్పులు తప్పడం లేదు.

ap government to distribute pensions at home tomorrow for those not credited in banks

ఇవాళ్టి వరకూ బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ జమ అయిన వారికి అక్కడే తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలా కాకుండా జమ కాని వారికి మాత్రం రేపటి నుంచి ఇళ్ల వద్దే సచివాలయ సిబ్బంది పంపిణీ చేసేలా ఆదేశాలు ఇస్తున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో బ్యాంకు ఖాతాలు ఉన్న వారు ఇవాళ సాయంత్రం బ్యాంకు పని వేళలు ముగిసేవరకూ ఎదురుచూసి రాకపోతే మాత్రం రేపు ఇంటి వద్ద తీసుకునేందుకు వీలు కల్పించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+