ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్-నవంబర్ నుంచి వాట్సాప్ లోనే ఈ 100 సేవలు..!

ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పౌర సేవల కోసం మెటాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నవంబర్ 30 నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఈ ఒప్పందంలో భాగంగా తొలి విడతగా 100 పౌర సేవలు వాట్సాప్ లోనే అందుబాటులోకి రానున్నాయి.ఇందులో రేషన్ కార్డులు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్స్, కరెంటు, ఆస్తిపన్ను బిల్లుల చెల్లింపు ఇలా పలు సేవలు ఉన్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో పలు పౌర సేవలు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం వివిధ వెబ్ సైట్లు, యాప్ లను వాడాల్సి వస్తోంది. అలాగే ఆఫ్ లైన్ సేవల కోసం ఊరంతా తిరగాల్సిన పరిస్ధితి. దీన్ని నివారించేందుకు వాట్సాప్ లోనే ఒక్క క్లిక్ తో 100 సేవలు ప్రస్తుతం అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో ప్రజలకు అవసరమైన బిల్లుల చెల్లింపుల నుంచి మొదలుపెట్టి ఆలయాల దర్శన టికెట్ల వరకూ ప్రతీదీ ఉన్నాయి.

ap government to made available these 100 public services in whatsapp from nov 30

నవంబర్ 30 నుంచి వాట్సాప్ లో ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న సేవల్లో ప్రధానంగా రేషన్ కార్డుల దరఖాస్తుల నుంచి పంపిణీ వివరాల వరకూ ఉండబోతున్నాయి. అలాగే విద్యార్ధులకు సర్టిఫికెట్లు, జనన, మరణాల సర్టిఫికెట్లు, ఆలయ దర్శనాల టికెట్లు, కరెంటు బిల్లులు, ఆస్తిపన్ను బిల్లుల చెల్లింపు, రాష్ట్రంలో ప్రధాన ఆలయాల దర్శన టికెట్ల బుకింగ్స్, ఆర్టీసీ టికెట్ల బుకింగ్స్, పార్శిల్ బుకింగ్స్, కమర్షియల్ లైసెన్స్ ల దరఖాస్తు, రిజిస్ట్రేషన్ల స్లాట్స్ బుకింగ్స్ వంటివి ఉన్నాయి.

దింతో పాటు వివిధ కీలక అంశాలకు సంబంధించిన సమాచారం కూడా ఇందులో అందుబాటులోకి తెస్తున్నారు. వీటిలో విద్యార్ధులకు ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ప్రాజెక్టులు, మార్కెట్ ధరలు, వాతావరణం, ఉన్నత విద్యలో పరీక్షల సమాచారం, యూనివర్శిటీ సర్ఠిఫికెట్లు, కోర్సులు, పరిశ్రమల శాఖ అనుమతుల సమాచారాన్ని కూడా మెటా సాయంతో ప్రభుత్వం వాట్సాప్ లో అందుబాటులోకి తీసుకురానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+