Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక ఆదేశాలు..!!

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఇంటి స్థలాల పైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేసారు. ఉద్యోగ సంఘాల హౌసింగ్‌ సొసైటీల వారీ ఇళ్ల స్థలాలకు ఎంత మేర భూమి అవసరమవుతుందో గుర్తించాలని...సీఎం త్వరలో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. అదే సమయంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం పటిష్ఠంగా అమలు చేయటం పైన కీలక సూచనలు చేసారు.

ఇంటి స్థలాలపై సీఎం రివ్యూ: ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి స్థలాల పై సీఎం జగన్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పది రోజుల్లో హైలెవల్ రివ్యూకు నిర్ణయించారు. దీనికి సంబంధించి సీఎస్ జవహర్ రెడ్డి రెవిన్యూ అధికారులకు మార్గదర్శకం చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ఉద్యోగ సంఘాల హౌసింగ్‌ సొసైటీల వారీ ఇళ్ల స్థలాలకు ఎంత మేర భూమి అవసరమవుతుందో పరిశీలన జరపాలని సిసిఎల్‌ఎ జి సాయిప్రసాద్‌కు సిఎస్‌ సూచించారు.

AP Government took key Decision on Allotment of house sites for Govt Employees, CS Key Directions

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పది రోజుల్లో ఇదే అంశంపై సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించనున్నారని జవహర్‌రెడ్డి వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్‌ హౌసింగ్‌ విధానాన్ని తీసుకొచ్చే అంశంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

ఆరోగ్య పథకం అమలుపైనా: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్‌ఎస్‌)ను మరింత పారదర్శకంగా, పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సిఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో సిఎస్‌ సమీక్ష నిర్వహించారు. మరో పది రోజుల్లో ఇహెచ్‌ఎస్‌ అంశంపై సిఎం సమీక్షిస్తారన్నారు. ఈ పథకం అమలు గురించి ఉద్యోగ సంఘాల నాయకుల నుంచి వచ్చిన ప్రతిపాదనల అమలుకు చర్యలు తీసుకున్నామని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు చెప్పారు.

మరికొన్ని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇహెచ్‌ఎస్‌ అమలుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ పథకాన్ని మరో ఏడాది పొడిగించామన్నారు.

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో: ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగుల ఇంటి స్థలాల విషయంలో ముఖ్యమైన నిర్ణయం ప్రకటించింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎంఐజీ జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో.. 10 శాతం ప్లాట్లను రిజర్వ్‌ చేసి, 20 శాతం రాయితీతో ప్లాట్లను అందిస్తోంది. ఈ ప్లాట్లు 200, 240 చదరపు గజాలుగా అందుబాటులో ఉండగా.. చదరపు గజానికి రూ.17,499గా ధరగా నిర్ణయించింది సీఆర్డీఏ.

ఒప్పందం అయ్యాక నెల లోపు మొత్తం సొమ్మును ఒకేసారి చెల్లించిన వారికి 5శాతం తగ్గింపు కూడా ఉంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 31 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 0866-2527124 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+