ap ips transfers : ఏపీలో 11 మంది ఐపీఎస్ లు బదిలీ - ఎవరెవరు ఎక్కడికంటే ?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం మరోసారి పోలీసు అధికారుల్ని బదిలీ చేసింది. 11 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలువురు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. వీరిని తాము పనిచేస్తున్న స్ధానాల నుంచి వివిధ స్ధానాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరు త్వరలో కొత్త స్ధానాల్లో విధుల్లో చేరబోతున్నారు.
ఇవాళ బదిలీ అయిన అధికారుల్లో విజిలెన్స్ అదనపు డీజీ, విజిలెన్స్ శాఖకు ఎక్స్ అఫీషియో సెక్రటరీగానూ ఉన్న రవిశంకర్ ను వైజాగ్ సిటీ పోలీసు కమిషనర్ గా బదిలీ చేశారు. ఈ మేరకు వైజాగ్ సిటీ కమిషనర్ గా ఉన్న త్రివిక్రమ్ వర్మను అక్కడి నుంచి ఎస్పీఎఫ్ ఐజీగా పంపారు. అలాగే రైల్వేస్ అదనపు డీజీగా ఉన్న కుమార్ విశ్వజీత్ ను విజిలెన్స్ డీజీగా పంపారు. అలాగే విజిలెన్స్ శాఖకు ఎక్స్ అఫీషియో సెక్రటరీగానూ అదనపు బాధ్యతలు కేటాయించారు.

ఆక్టోపస్ ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ ను వైఎస్సార్ జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. వైఎస్సార్ జిల్లా ఎస్పీగా ఉన్న అన్బురాజన్ ను అనంతపురం ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. అలాగే అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్న కె. శ్రీనివాసరావును వైజాగ్ లా అండ్ ఆర్డర్ డీసీపీగా పంపారు. వైజాగ్ లా అండ్ ఆర్డర్ ఎస్పీగా ప్రస్తుతం పనిచేస్తున్న విద్యాసాగర్ నాయుడిని గ్రేహౌండ్స్ ఎస్పీగా పంపారు. ఏసీబీ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావును అక్కడి నుంచి అన్నమయ్య జిల్లా ఎస్పీగా పంపారు. అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఉన్న గంగాధర్ రావును అనంతపురం 14వ బెటాలియన్ కమాండర్ గా బదిలీ చేశారు.
గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా ఉన్న అద్నాన్ నయీమ్ అస్మీని అక్కడి నుంచి బదిలీ చేసి ఏసీబీ ఎస్పీగా పంపారు. మరో ఐపీఎస్ పి.జగదీష్ ను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పంపారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వారికి బదిలీ ఉత్తర్వులు అందాయి. వెంటనే వీరు విధుల్లో చేరాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications