Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

GST 2.0: వ్యాపారులకు ఏపీ సర్కార్ ఊరట- ఎమ్మార్పీ రూల్స్ లో మార్పులు..!

దేశవ్యాప్తంగా ఇవాళ జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కేంద్రం ప్రకటించిన జీఎస్టీ 2.0 ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం కూడా ఎమ్మార్పీ నిబంధనల్లో సవరణలు చేసింది. ఈ మేరకు వ్యాపారులు తప్పనిసరిగా వీటిని పాటించాలని లీగల్ మెట్రాలజీ శాఖ ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది.

కేంద్రం జీఎస్టీ 2.0 కింద అమలులోకి తెచ్చిన ప్రధాన సంస్కరణల అమలుపై లీగల్ మెట్రాలజీ శాఖ దృష్టిసారిస్తోంది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ లీగల్ మెట్రాలజీ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్రంలో జీఎస్టీ 2.0 అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు ఇచ్చారు. కేంద్రం ఇస్తున్న జీఎస్టీ 2.0 ప్రయోజనాల్ని వినియోగదారులకు అందేలా చూడాలని కోరారు.

AP Government Tweaks MRP Rules Post-GST 2 0 Implementation exemptions to traders

లీగల్ మెట్రాలజీ చట్టంలోని రూల్ 6 ప్రకారం ప్రతీ ప్యాకేజీపై తప్పనిసరిగా ఈ వివరాలు ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇందులో తయారీదారు పేరు మరియు చిరునామా, ఉత్పత్తి పేరు, నికర పరిమాణం, తయారీ / ప్యాకింగ్ / దిగుమతి చేసిన నెల, సంవత్సరం, గరిష్ట చిల్లర ధర (అన్ని పన్నులు కలిపి), వినియోగదారులు ఫిర్యాదు చేయాల్సిన వివరాలు ఉండాలి.

AP Government Tweaks MRP Rules Post-GST 2 0 Implementation exemptions to traders

వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి , పరిశ్రమపై అనవసరమైన భారాన్ని తగ్గించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ఇచ్చిన సూచన మేరకు కొన్నింటిలో సడలింపులు ఇచ్చారు. ఇందులో ధర స్టిక్కరింగ్ 22-09-2025కు ముందు తయారు చేసిన ప్యాకేజీలపై కొత్త ఎంఆర్పీ స్టిక్కర్లు అతికించడం తప్పనిసరి కాదు. స్వచ్ఛందం మాత్రమే. కానీ పాత ఎంఆర్పీని తొలగించరాదని తెలిపారు. అలాగే పత్రికలలో ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేదు.

AP Government Tweaks MRP Rules Post-GST 2 0 Implementation exemptions to traders

తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులు కొత్త ధరల సర్క్యులర్లను డీలర్లకు పంపాలి. ప్రతులను లీగల్ మెట్రాలజీ డైరెక్టర్, రాష్ట్ర కంట్రోలర్లకు పంపించాలి.పాత ప్యాకేజింగ్ సామాగ్రి 31-03-2026 వరకు లేదా స్టాక్ పూర్తయ్యే వరకు వాడుకోవచ్చు. ఎంఆర్పీ సవరణలు ముద్రించడం, స్టిక్కర్లు అతికించాలి. పాత ప్యాకేజీలపై యూనిట్ ధర ప్రకటించడం తప్పనిసరి కాదని, స్వచ్ఛందం మాత్రమేనని తెలిపారు. తయారీదారులు/ప్యాకర్లు/దిగుమతిదారులు ధర తగ్గింపుల గురించి డీలర్లు, రిటైలర్లు, వినియోగదారులకు ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలి. ఈ సడలింపుల వల్ల జీఎస్టీ రేట్ల తగ్గింపుల లాభం నేరుగా వినియోగదారులకు చేరుతుంది. పరిశ్రమపై వ్యయం తగ్గుతుంది మరియు పాత ప్యాకేజింగ్ వృథా కాదు. ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేసినట్లు ఫిర్యాదు చేయాలనుకుంటే టోల్ ఫ్రీ నంబర్ 1967కు కాల్ చేయాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+