పెన్షనర్ల డీఆర్ పై ఏపీ ప్రభుత్వం తాజా అప్ డేట్..కీలక ఉత్తర్వులు..
ఏపీలో పెన్షనర్లకు ప్రభుత్వం తాజా అప్ డేట్ ఇచ్చింది. దసరా సందర్భంగా ప్రకటించిన డీఆర్ బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ డీఆర్ బకాయిల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్రంలోని పెన్షనర్లకు ఈ ఉత్తర్వులు వర్తించబోతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. పెన్షనర్లకు బకాయి పడిన డీఆర్ (డియర్ నెస్ రిలీఫ్) చెల్లింపు ఎప్పుడనేది ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏపీలో పెన్షనర్లకు 3.64 శాతం డీఆర్ పెంచుతూ దసరా కానుకగా నిర్ణయం తీసుకుంది. ఈ పెంపును నవంబర్ పెన్షన్ తో కలిపి డిసెంబర్ లో చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే పెన్షన్ దారులకు ప్రభుత్వం 2022 నుంచి డీఆర్ బకాయి పడింది. ఈ బకాయిలు అప్పటి నుంచి పేరుకుపోయాయి. దీంతో ప్రభుత్వం వీటిని త్వరలో చెల్లించేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది. అలాగే బకాయిల చెల్లింపు కోసం షెడ్యూల్ కూడా ఇచ్చింది.

ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెన్షనర్లకు 2022 నుంచి చెల్లించాల్సిన బకాయిలను వచ్చే ఏడాది అంటే 2024 ఏప్రిల్ నుంచి మూడు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 2024 ఏప్రిల్ నుంచి మూడు విడతలు అంటే ఏప్రిల్, జూలై, అక్టోబర్ లో చెల్లించాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులపై చర్చ జరుగుతోంది.
ఎందుకంటే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల సమయానికి పెన్షనర్లకు పాత బకాయి కింద ఓ డీఏ చెల్లింపు ఉంటుంది. ఆ తర్వాత రెండు బకాయిలు అంటే జూలై, అక్టోబర్ లో చెల్లించాల్సిన రెండు విడతలు మాత్రం కొత్తగా ఏర్పడే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ప్రభుత్వం వీటిని సకాలంలో చెల్లిస్తుందా లేదా అన్న దానిపై మళ్లీ సందేహాలు నెలకొంటున్నాయి. అయితే ఎన్నికల వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటగా దసరా కానుకగా ప్రభుత్వం తాజాగా డీఏ, డీఆర్ లు పెంచడంతో బకాయిలపై చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications