Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇవన్నీ చేస్తేనే అన్నదాత సుఖీభవ డబ్బు లు..! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..!

ఏపీలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద లబ్దిదారులకు నిధుల విడుదల విషయంలో ప్రభుత్వం ఇవాళ మరో కీలక ప్రకటన చేసింది. అన్నదాత సుఖీభవ పథకం డబ్పులు ఈ నెలలోనే జమ చేస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం..కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదల చేయకపోవడంతో వాయిదా వేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేసేందుకు ముహుర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఆగస్టు 2 ప్రధాని మోడీ తన వారణాసి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ డబ్పులు రూ.2 వేల చొప్పున విడుదల చేస్తారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదే రోజు ఏపీ ప్రభుత్వం కూడా లబ్దిదారులైన రైతులకు రూ.5 వేలు చొప్పున కలిపి మొత్తం రూ.7 వేలు విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. అదే సమయంలో లబ్దిదారులకు ఇవాళ ప్రభుత్వం కీలక సూచన చేసింది.

ap government urges annadata sukhibhava beneficiaries to finish eykc aadhar seeding NPCI mapping

అన్నదాత సుఖీభవ లబ్ధిదారులలో అధికభాగం జాతీయ పేమెంట్స్ కార్పోరేషన్ (ఎన్పీసీఐ)లో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ఇంకా కొందరు రైతుల వివరాలు మాత్రం ఇందులో మ్యాపింగ్ కాలేదు. అన్నదాత సుఖీభవ పథకంలో ఈకేవైసీ పూర్తిచేసిన లబ్ధిదారుల డేటాను ఎన్పీసీఐ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత కొన్ని రకాల సూచనలు చేసిందని ప్రభుత్వం తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకూ ఈ పథకం కింద 47,41,792 మంది రైతుల ఈకేవైసి పూర్తి అయ్యిందని వెల్లడించింది.

అయితే మరో 76,705 లబ్ధిదారులు మాత్రం బ్యాంకుల్లో ఎలాంటి లావాదేవీలు జరపకుండా క్రియాశీలకంగా లేరని తేల్చింది. కాబట్టి వీరంతా తమ బ్యాంకుల్ని సంప్రదించి ఈకేవైసీ చేయించుకోవాలని సూచించింది. అలాగే తాజాగా లావాదేవీలు జరపడం ద్వారా తమ ఖాతాల్ని యాక్టివేట్ చేసుకోవాలని సూచిస్తోంది. అలాగే 44,977 లబ్ధిదారుల డేటా ఎన్పీసీఐలో కనిపించలేదని తెలిపింది. కాబట్టి వీరు కూడా తక్షణం తమ ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో లింక్ చేయించి, ఎన్పీసీఐలో మ్యాపింగ్ చేయించుకోవాలని కోరుతోంది.

ap government urges annadata sukhibhava beneficiaries to finish eykc aadhar seeding NPCI mapping

రైతు వివరాలతో ఉన్న ఈ రెండిటి సమాచారం సంబంధిత రైతు సేవా కేంద్రాలలో, వ్యవసాయ అధికారుల లాగిన్లలో అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది. కాబట్టి ఈ రెండు పూర్తి కాని 1.21 లక్షల మంది రైతులకు తగు సూచనలు చేసి బ్యాంకులకు పంపి ఈకేవైసీతో పాటు ఆధార్ లింకింగ్, ఎన్సీపీఐ మ్యాపింగ్ పూర్తి చేయించాలని అధికారుల్ని ఆదేశించింది. ఈ ప్రక్రియ త్వరగా చేబట్టడం ద్వారా సేకరించిన డేటాను ఆర్టీజీఎస్, ఆర్ధిక సేవల కేంద్రం సంయుక్తంగా పరిశీలించి తుది జాబితా తయారు చేస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+