అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దమ్మాలపాటి పైన అప్పీల్ వెనక్కు : సుప్రీంకు నివేదించిన ఏపీ ప్రభుత్వం

By Lekhaka
|
Google Oneindia TeluguNews

కొద్ది రోజుల క్రితం వరకు రాష్ట్రంలో ప్రధాన చర్చకు కారణమైన అమరావతి భూముల వ్యవహారంలో దమ్మలపాటి శ్రీనివాస్ ఇష్యూలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా పని చేసిన దమ్మాల పాటి రాజధాని ప్రాంతంలో ముందస్తు సమాచారంతో భూములు కొనుగోలు చేశారని, ఎజి హోదాలో ఉండి భూములు కొనుగోలు చేశారంలూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎసిబి నమోదు చేసిన కేసుపై స్టే ఇస్తూ.. హైకోర్టు గ్యాగ్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి భూముల వ్యవహారంలో విచారణపై స్టే ఇవ్వడంతో పాటు ఈ అంశంపై మీడియాలో కథనాలు ప్రసారం చేయకుండనేది ఈ ఆదేశాల సారాంశం. వీటి పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. దీంతో..హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. తాజాగా ఇవాళ జరిగిన విచారణలో... మాజీ ఎజి దమ్మాలపాటి శ్రీనివాస్‌ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం..కొనసాగింపుగా..హైకోర్టులో పిటిషన్‌ ఇంకా పెండింగ్‌లో ఉందని, దానిలో కౌంటర్‌ దాఖలు చేయనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానాకి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.

AP government withdraws appeal petition on Dammalapti lands case in supreme court

దీంతో.. నాలుగు వారాల్లో విచారణ ముగించాలని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. దీంతో..అమరావతి భూముల కేసులో అప్పీల్ పిటిషన్ ను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రెండ్రోజుల క్రితం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా సుప్రీం తీర్పు వచ్చింది. దీంతో..ప్రభుత్వం న్యాయ పరంగా సుదీర్ఘంగా కసరత్తు జరిగింది. ఆ తరువాత.. దమ్మాలపాటి కేసు పిటిషన్‌ను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం..అందులో ఎటువంటి అంశాల తాజాగా చేర్చుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
AP Govt withdraws appeal petition against Dammalapati in Supreme court on Amarvati lands issue. Govt decided to file counter in high court pending case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X