AP Assembly : 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ భేటీ-గవర్నర్ నోటిఫికేషన్-తొలిసారి ప్రసంగం

ఏపీలో ఈ ఏడాది వార్షిక బడ్డెట్ సమావేశాలకు రంగం సిద్దమవుతోంది. ఈ నెల 14న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు వీలుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేశారు. 14న సమావేశం కానున్న శాసనసభ, శాసన మండలి.. అనంతరం బీఏసీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల ఆధారంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాయి. తొలిరోజు మాత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈసారి ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వైసీపీ సర్కార్ కు అసెంబ్లీలో ఇదే చివరి పూర్తిస్దాయి బడ్జెట్ కాబోతోంది. వచ్చే ఏడాది ఎన్నికల సందర్భంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతారు. దీంతో ఈసారి ఎన్నికల బడ్జెట్ గా దీన్ని భావించవచ్చు. ఈ బడ్జెట్ లో వైసీపీ సర్కార్ కొత్త పథకాలను, ఉన్న వాటిలో పలుమార్పులను ప్రకటించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్.. తొలిసారి ప్రసంగించబోతున్నారు. తొలిసారి గవర్నర్ అయిన నజీర్ కు ఇదే అసెంబ్లీలో తొలి ప్రసంగం కూడా.

ap governor issued notification for assembly budget meet from march 14

మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పది రోజుల పాటు సభ జరిగే అవకాశాలున్నాయి. ఈ పది రోజుల్లో కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును కూడా ఈసారి ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే సుప్రీంకోర్టులో అమరావతి కేసుల విచారణ సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం బిల్లు పెడుతుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఈ ఏడాది రాజధాని మార్పు జరగకపోతే వచ్చే ఏడాది తరలింపు కష్టం కానున్న నేపథ్యంలో కనీసం సీఎం కార్యాలయం తరలింపుపై అయినా అసెంబ్లీలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+