ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం-కూటమిపై పొగడ్తలు-వైసీపీపై విమర్శల బాట..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆనవాయితీగా వస్తున్న ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక ప్రసంగం చేశారు. ఇందులో రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకూ చోటు చేసుకున్న పరిణామాల్ని వివరించారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో గవర్నర్ వివరించారు. అలాగే రాష్ట్రానికి పునర్ వైభవం తెచ్చేందుకు ఎన్డీయే కూటమి సర్కార్ కృషి చేస్తుందని ఆయన ఆశాభా వం వ్యక్తం చేశారు.

ఇవాళ అసెంబ్లీలో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ నజీర్.. ముందుగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత వారిపై ఉందన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో విభజిత రాష్ట్రంపై ఒత్తిడి పెరిగిందని, కేంద్రం నుంచి తగినంత పరిహారం లభించలేదన్నారు. అశాస్త్రీయ విభజనతో రాష్ట్రం అన్ని విధాలా నష్టోపోయిందన్నారు. దీంతో 2014-19 మధ్య ప్రభుత్వం సన్ రైజ్ ఏపీ కోసం గట్టి పునాదులు వేసిందన్నారు. రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానం, ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందన్నారు. ఇవన్నీ చంద్రబాబు దూరదృష్టితో సాధ్యమైనట్లు తెలిపారు.

ap governor key address in joint assembly session lauds government blames past ysrcp rule

కానీ 2019లో జరిగిన ప్రభుత్వ మార్పు రాష్ట్రాన్ని తిరిగి కష్టాల్లోకి నెట్టిందన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్ల అసమర్ధపాలన రాష్ట్రానికి మరో దెబ్బ అన్నారు. గత ఐదేళ్లలో ప్రజల్ని బెదిరించారని, అధికారుల్ని నిలదీశారని గుర్తుచేశారు. విభజన కంటే ఈ ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన ఈ విధ్వంస పాలన 2024లో ముగిసిందన్నారు. దీంతో రాష్ట్రం అన్నివిధాలుగా నష్టపోయిందని, పెట్టుబడులు రాకుండా పోయాయన్నారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు, నిధుల మళ్లింపు, పన్నుల బాదుడుతో ఆర్ధిక దుర్వినియోగం జరిగిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా భావించిన అమరావతి రాజధాని ప్రాంతం వైసీపీ పాలనలో పూర్తిగా నాశనమైందన్నారరు. అమరావతి కలను తుడిచిపెట్టే ప్రయత్నంతో ప్రభుత్వం వికేంద్రీకృత పాలన ముసుగులో మూడు రాజధాని నగరాల ఆలోచనతో ప్రజలను గందరగోళానికి గురి చేసిందన్నారు. 2019-24 కాలంలో ఎలాంటి నీటిపారుదల ప్రాజెక్టు, కొత్త పరిశ్రమలు, రోడ్లు, భవనాలు, ఆసుపత్రులు, తాగునీటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏవీ చేపట్టలేదన్నారు.

ap governor key address in joint assembly session lauds government blames past ysrcp rule

పారదర్శకత లేని గత ప్రభుత్వ దుష్పరిపాలన, గత ఐదేళ్ల పాలనలో వ్యవస్థల అంతరాయం మరియు విపరీతమైన అవినీతి గురించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఈ ప్రభుత్వం ఒత్తిడి చేసిందన్నారు. నిధుల వినియోగంలో అనేక వ్యత్యాసాలు, దుర్వినియోగం ఫలితంగా రాష్ట్ర ఖజానాకు, రాష్ట్ర సహజ వనరులకు భారీ నష్టం వాటిల్లిందని తన ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసిందన్నారు. ఇలాంటి తరుణంలో పాలనను తిరిగి గాడిలో పెట్టడం నిజంగా చాలా కష్టమైన పని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రారంభించిందని, 'సూపర్ సిక్స్' వాగ్దానాలకు స్థిరమైన నిబద్ధతను ప్రకటించిందన్నారు.

16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించడం, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రత పెన్షన్లను రూ. రూ.కి పెంచడం వంటి అనేక చర్యలతో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తన ట్రేడ్‌మార్క్ పీపుల్-సెంట్రిక్ గవర్నెన్స్‌ని ప్రారంభించిందన్నారరు. స్కిల్ సెన్సస్‌ని నిర్వహించడం, అన్న క్యాంటీన్‌లను తిరిగి ప్రారంభించడం ద్వారా పేదలకు ఆహారాన్ని అత్యంత నామమాత్రంగా రూ. 5, మరియు ఉచిత ఇసుక సరఫరా వంటి చర్యల్ని ప్రారంభిస్తుందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రదాని నరేంద్ర మోదీ సంపూర్ణ మద్దతుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థత, నిరూపితమైన నాయకత్వంలో తన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి అన్ని విధాలా కృషి చేస్తుందని గవర్నర్ తెలిపారు. ప్రస్తుత ఆందోళనకరమైన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+