ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం-నవరత్నాలపై ప్రశంసల జల్లు..
ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు ఉభయసభల సమావేశం ప్రారంభమైంది. సంప్రదాయంగా వస్తున్న గవర్నర్ ప్రసంగానికి ఉభయసభల సంయుక్త సమావేశం వేదికైంది. ఈ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక ప్రసంగం చేశారు.

సరిగ్గా పది గంటలకు ఉభయసభల సమావేశం ప్రారంభం కాగా.. కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించారు. ఇందులో ముందుగా నవరత్నాల పేరుతో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్ని ఆయన ప్రశంసించారు. నవరత్నాలతో రాష్ట్రానికి సంక్షేమ పాలన అందుతోందన్నారు. నాలుగేళ్లుగా ఐదుకోట్ల మందికి సంక్షేమ పాలన అందుతోందన్నారు. ప్రత్యక్షనగదు బదిలీ ద్వారా అవినీతి లేని పాలన అందుతోందన్నారు. రాష్ట్రంలో 11.43 శాతం జీడీపీ వృద్ధి నమోదైందన్నారు. 2020-21 జీడీపీ వృద్ధిలో ఏపీ దేశంలోనే నంబర్ 1గా ఉందన్నారు.

వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో తమ ప్రభుత్వం అభివృద్ధి సాధించిందని గవర్నర్ నజీర్ తెలిపారు. నాడు-నేడుతో స్కూళ్ల ఆధునీకరణ చేశామని, మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్ధులకు ఎంతో మేలు చేస్తున్నామన్నారు. రూ.9900 కోట్లతో నాలుగేళ్లుగా ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇచ్చే అమ్మఒడి పథకం అందిస్తున్నామన్నారు. అలాగే జగనన్న విద్యాకానుక, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో స్కూళ్లకు వచ్చే విద్యార్ధుల సంఖ్య పెరిగిందన్నారు. 8వ తరగతి విద్యార్ధులకు బైజూస్ కంటెంట్ తో ట్యాబ్స్ ఇచ్చామన్నారు. విద్యాసంస్ధల్లో డిజిటల్ లెర్నింగ్ కీలకంగా మారిందని, 6 నుంచి 9 వ తరగతి వరకూ సిలబల్ లో మార్పులు చేశామని గవర్నర్ తెలిపారు. 1 నుంచి 7వ తరగతి వరకూ సిలబస్ రీడిడైన్ చేశామన్నారు. ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లే విద్యార్దులకు ఆర్ధిక సాయం చేస్తున్నామన్నారు. ప్రతీ మండలంలో కనీసం 2 జూనియర్ కాలేజిలు పెడుతున్నామన్నారు.

అలాగే ఆరోగ్యరంగంలోనూ భారీ సంస్కరణలు చేపట్టామని గవర్నర్ నజీర్ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో లబ్దిదారులకు అందిస్తున్న చికిత్సల సంఖ్య భారీగా పెంచామన్నారు. నాడు-నేడుతో ఆస్పత్రుల ఆధునీకరణ చేస్తున్నామన్నారు.ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం త్వరలో అమలు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, వీటికి అదనంగా మరో 17 కాలేజీలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కంటివెలుగు పథకం ద్వారా ఆరు దశల్లో కంటి చికిత్సలు చేయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్ చికిత్సల్ని సైతం ఆరోగ్యశ్రీలోకి తెచ్చామన్నారు. వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు జారీ చేశామన్నారు.

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా 30.56 ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చామని గవర్నర్ తెలిపారు. ప్రతీ స్ధలంలోనూ ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ సాయం చేస్తున్నామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. ఈ ఇళ్లకు విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామన్నారు. దేశంలో తొలిసారి వైఎస్సార్ పించన్ కానుక రూపంలో అన్ని పెన్షన్లను తీసుకొచ్చామన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి పింఛన్ అందిస్తున్నామన్నారు. ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా రూ.24 వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. వైఎస్సార్ మత్సకార భరోసా రూపంలో మత్సకారులకు రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నామన్నారు. అలాగే వారికిచ్చే డీజిల్ లో సబ్సిడీ కూడా ఇస్తున్నామన్నారు. మత్సకారులు చనిపోయే ఇచ్చే పరిహారం రూ.10 లక్షలకు పెంచామన్నారు. జగనన్న చేదోడు ద్వారా నాయీ బ్రహ్మణులు, టైలర్లకు ఏటా రూ.10 వేల చొప్పున సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ బీమా పథకం ద్వారా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు బీమా అందిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు ఏటా రూ.10 వేలు ఇస్తున్నామన్నారు.
జూనియర్ లాయర్లకు లానేస్తం పథకం ద్వారా రూ.5 వేల స్టయిఫండ్ ఇస్తున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత కోసం స్ధానిక సంస్ధల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ వారికి 50శాతం కేటాయించామన్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.వైఎస్సార్ చేయూత ద్వారా 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా ఇస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా కాపు మహిళలకు 15 వేల రూపాయల చొప్పున ఇస్తున్నామన్నారు.
-
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications