వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్లు- ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం

|
Google Oneindia TeluguNews

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో సొంత పార్టీ నుంచి గెలుపొందిన నేతల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న వైసీపీ.. మున్సిపల్‌ చట్టంలో కీలక సవరణలతో వారిని సంతృప్తి పర్చబోతోంది. ఈ మేరకు రాష్ట్రంలోని కార్పోరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రెండు వైస్‌ ఛైర్మన్‌ పదవులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ హరిచందన్ ఇవాళ ఆమోదించారు. దీంతో రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ మేరకు పదవులను వైసీపీ నేతలకు కట్టబెట్టనున్నారు.

మున్సిపల్‌ పదవులకు వైసీపీలో తీవ్రపోటీ

మున్సిపల్‌ పదవులకు వైసీపీలో తీవ్రపోటీ


పంచాయతీలు, జడ్పీలతో పోలిస్తే కాస్తో కూస్తో నిధుల లభ్యత ఉండే మున్సిపల్‌ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పదవుల కోసం అధికార వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ సునామీ నేపథ్యంలో ఆ పార్టీలోనే పదవుల కోసం తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. దీంతో ఒకరిని సంతృప్తి పర్చాలంటే మరొకరిని నిరాశ తప్పేలా లేదు. దీంతో డిప్యూటీ సీఎంల తరహాలోనే బహుళ పదవుల ఫార్ములాకు సీఎం జగన్ తెరలేపారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి పూర్తి కాలం పనిచేసేలా పదవుల పంపకం చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం కొత్తగా మున్సిపల్‌ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

డబుల్‌ డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్ల ఫార్ములా

డబుల్‌ డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్ల ఫార్ములా

మరీ డిప్యూటీ సీఎంల తరహాలో ఐదుగురిని కాకుండా ప్రస్తుతం ఒక్కో డిప్యూటీ మేయర్, వైస్‌ ఛైర్మన్‌ స్ధానంలో ఇద్దరేసి చొప్పన అవకాశం కల్పించాలనీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ ఇలా చేయాలంటే మున్సిపల్‌ చట్టంలో సవరణలు చేయక తప్పదు. రాజ్యాంగం ప్రకారం ఉన్న అవకాశాలు పరిశీలించాలి. దీంతో ప్రభుత్వం ఈ మేరకు మున్సిపల్‌ చట్టంలో సవరణలు చేస్తూ ఓ ఆర్డినెన్స్‌కు తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై కార్పోరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రెండు వైస్‌ ఛైర్మన్‌ పదవులను ఏర్పాటు చేస్తూ నిబంధనలను సవరించారు.

మున్సిపల్‌ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం

మున్సిపల్‌ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం

రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రెండేసి పదవులు ఏర్పాటు చేసేందుకు వీలుగా మున్సిపల్‌ చట్టంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్ ఇవాళ ఆమోద ముద్ర వేశారు. వాస్తవానికి నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి ఆర్డినెన్స్‌ పంపుతున్నట్లు చెప్పారు. కానీ ఇవాళ ఉదయానికి ఆర్డినెన్స్‌ గవర్నర్‌ వద్దకు వెళ్లడం దానికి ఆమోద ముద్ర పడిపోవడం కూడా చకచకా జరిగిపోయాయి. దీంతో రేపు జరగాల్సిన మున్సిపల్‌ కార్పోరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలకు మార్గం సుగమమైంది.

English summary
andhra pradesh governor biswabhushan harichandan on wednesday approved an ordinance for establishing dual deputy mayors in corporations and dual vice chairmans in municipalities and nagar panchayats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X