అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్-భూసేకరణపై చంద్రబాబు కీలక నిర్ణయం..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించడంతో పాటు వేగంగా పూర్తి చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే వేల ఎకరాలు భూకేటాయింపులు చేయడంతో పాటు కీలక భవనాల నిర్మాణాల కాంట్రాక్టుల అప్పగింతలు, కొత్త సంస్థలకు ఆహ్వానం పలకడం వంటివి చేస్తూనే ఉన్నారు. అయితే అమరావతిలో ఈసారి భూసమీకరణ విషయంలో ప్రభుత్వానికి కొన్ని చోట్ల చుక్కెదురవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 52వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో
ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని అతి కొద్దిమంది రైతుల భూములను భూసేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు.
రైతులను ఇబ్బంది పెట్టకూడదనేది ప్రభుత్వ నిర్ణయమని మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్ కు రైతులు ముందుకొస్తే తీసుకుంటామన్నారు.

AP Govt Allows Amaravati Farmers to Select Between Land Pooling Acquisition

అలాగే దాదాపు 1800 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ కు రావాలని మరోసారి రైతుల్ని మంత్రి నారాయణ కోరారు. భూసేకరణ కంటే భూసమీకరణ అయితేనే రైతులకు లబ్ది పొందుతుందన్నారు. భూములు ఇవ్వకపోవడం తో కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. మరోవైపు ఏజీసీలో మౌలిక వసతుల కల్పన కు టెండర్లు దక్కించుకున్న సంస్థకు లెటర్ ఆఫ్ అథారిటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు.

AP Govt Allows Amaravati Farmers to Select Between Land Pooling Acquisition

సీఆర్డీయేఆద్వర్యం లో ఉన్న ఏడీసీఎల్ తరహాలో కొత్తగా మరో ఎస్పీవీ ఏర్పాటుకు అధారిటీ ఆమోదం తెలిపింది. ఎయిర్ పోర్ట్,స్పోర్ట్స్ సిటీ,ఎన్టీఆర్ విగ్రహం వంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణం కొరకు కొత్తగా ఎస్పీపీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అర్బన్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ గైడెన్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. రెవెన్యూ,సర్వే సెటిల్మెంట్ శాఖల నుంచి 138 మంది ఉద్యోగులను డిప్యూటీషన్ పై తీసుకునేందుకు ఆమోదం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+