వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలి అవార్డు ధర్మాడి సత్యానికి: వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌: ఆయన సూచనల మేరకేనా..!

|
Google Oneindia TeluguNews

కేంద్రంలో పద్మ అవార్డుల తరహాలో ఏపీ ప్రభుత్వం సైతం అదే తరహాలో రాష్ట్రంలో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ రంగాల్లో ప్రజా సేవలు అందించిన ప్రతిభావంతులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులకు ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే, కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే ప్రభుత్వం ఈ అవార్డు కింద తొలి వ్యక్తిని ఎంపిక చేసింది. ఒక సామాన్యుడికి ఈ అవార్డు ఇవ్వటం ద్వారా తగిన గుర్తింపు ఇచ్చినట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో భాగంగా.. ఒక ఆధ్యాత్మిక ప్రవచన కర్త చేసిన సూచన మేరకే ఈ ఎంపిక జరిగిందని చెబుతున్నారు. గోదావరిలో మునిగిన బోటును బయటకు తీసిన ధర్మాడి సత్యానికి వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ధర్మాడి సత్యంకు తొలి అవార్డు..
ఇటీవల గోదావరిలో మునిగిన బోటును బయటకు తీసిన ధర్మాడి సత్యానికి వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు ఇవ్వనున్నట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటును వెలికితీయడంలో ధర్మాడి సత్యం.. అతని బృందం చేసిన కృషికి గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం చేయలేని పనిని వీరు ప్రతికూల పరిస్థితుల్లోనూ సమర్ధవంతంగా చేయగలిగారు. ప్రభుత్వం వీరికి 22 లక్షల కాంట్రాక్టు అప్పగించింది.

AP Govt Announced YSR lifetime achievement award to Dharamada Satyam

ఈ కాంట్రాక్టు మేరకు బోటును వెలికితీయడంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ.. దానిని ఒడ్డుకు చేర్చేందుకు సత్యం కనబరిచిన పట్టుదలపై పలువురు ప్రశంసలు కురిపించారు. దీంతో.. తాజాగా ధర్మాడి సత్యం చేసిన కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అతన్ని విశేష పురస్కారంతో సత్కరించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు ఈ అవార్డు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. అయితే, దీని పైన టీవీ ఛానళ్లలో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే ఒక ప్రముఖ వ్యక్తి ప్రభుత్వ ఆలోచన మంచిదని..

అయితే, ఇందుకు ధర్మాడి సత్యం అర్హుడంటూ ఆయన ప్రభుత్వానికి సూచన చేసారు. ముఖ్యమంత్రి వద్దకు ఆ విషయం చేరటంతో..సీఎం జగన్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డు అందుకొనే తొలి వ్యక్తిగా ధర్మాడి సత్యం పేరును ఖరారు చేసారు. ఈ అవార్డు కింద పది లక్షల నగదు..రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసా పత్రం లభిస్తాయి. జనవరి 26న జరిగే రిపబ్లిక్ వేడుకల్లో ఈ అవార్డును అందచేయనున్నారు.

English summary
AP Govt Announced YSR life time achievement award to Dharamada Satyam. He bought up the boat from godavari river in a difficult situation. Govt identify his capability and selcted for this award as first candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X