టీటీడీలో అన్యమత ఉద్యోగులకు రెండు ఆప్షన్లు, ప్రభుత్వం ఆమోదం ..!!
Tirumala: టీటీడీలో అన్యమత ఉద్యోగుల పై కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి చర్యల దిశగా కసరత్తు జరుగుతోంది. రెండు ఆప్షన్ల పై టీటీడీ బోర్డు చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. దీంతో.. ఇప్పుడు టీటీడీ పాలక మండలి ఈ ఉద్యోగుల విషయంలో న్యాయ పరమైన సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలోనే వీరి విషయంలో పూర్తి పరిష్కారం చూపేందుకు కసరత్తు కొనసాగుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగుల విషయంలో చర్యలకు రంగం సిద్దం అవుతోంది. టీటీడీ బోర్డు వీరి విషయంలో కీలక ప్రతిపాదనలు చేసింది. హిందూయేతర ఉద్యోగుల తో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించాలని, లేదా వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుత బోర్డు ఏర్పాటైన తర్వాత జరిగిన రెండో సమావేశంలోనే ఈ అంశాన్ని అజెండాలో చేర్చి చర్చించారు. ఇతర మతాలకు చెందిన ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రెండు ప్రత్యామ్నాయాలు నిర్ణయించారు. అందులో మొదటిది స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్). దీనికి ముందుకొచ్చే వారికి మిగిలిన సర్వీసు కాలానికి గానూ ఇవ్వాల్సిన జీతభత్యాలను ఒకేసారి చెల్లిస్తారు. అందుకు అంగీకరించని వారిని ప్రత్యామ్నాయంగా ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తారు.

ఈ రెండు ప్రతిపాదనలను అన్యమత ఉద్యోగుల ఎదుట ఉంచి వారి అభీష్టం మేరకు అమలు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో అన్యమత ఉద్యోగుల తొలగింపుపై టీటీడీ కసరత్తు ప్రారంభించింది. టీటీడీలో ఇతర మతాలకు చెందినవారిని నియమించరాదంటూ నిబంధనలు అమల్లోకి రాకముందే పలువు రు ఉద్యోగాల్లో చేరారు. అలాంటి వారు సర్వీసు రిజిస్టర్లలో తమ మతాలను స్పష్టం గా పేర్కొన్నారు. వారిలో చాలామంది ఇప్పటి కే రిటైరయ్యారు. ఇప్పటికీ సర్వీసులో ఉన్న ఈ తరహా ఉద్యోగులు 40 మంది మాత్రమేనని సమాచారం. తొలుత వీరికి స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇస్తూ సర్క్యులర్ జారీ చేయనున్నారు. వీఆర్‌ఎస్ ప్రతిపాదనకు అంగీకరించని ఉద్యోగుల జాబితాను దేవదాయ శాఖ ద్వారా రాష్ట్ర మైనారిటీ సంక్షే మ శాఖకు టీటీడీ పంపనుంది. ఆ శాఖ అం దుబాటులో ఉన్న ఖాళీలకు అనుగుణంగా వారిని ఆయా పోస్టులకు బదిలీ చేయనుంది.












Click it and Unblock the Notifications