అప్పుల్లో కూరుకుపోతున్న ఏపీ : 'ఐదు నెలల్లోనే ఆరోసారి రుణం'
విజయవాడ : విభజన నేపథ్యంలో.. ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్న ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఇప్పటికే ఐదుసార్లు రిజర్వ్ బ్యాంకు నుంచి 6,050 కోట్ల రుణాన్ని తీసుకున్న ఏపీ సర్కార్.. తాజాగా మరో రూ.400 కోట్ల రుణానికి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
గత నాలుగు నెలల్లోనే రిజర్వ్ బ్యాంకు నుంచి ఐదుసార్లు రుణం పొందిన ఏపీ ప్రభుత్వం.. 2016-17 ఆర్థిక సంవత్సరం ఇంకా సగం కూడా పూర్తి కాకముందే ఆరోసారి రుణానికి ఆర్జీ పెట్టుకుంది. రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని హామి ఇచ్చిన కేంద్రం.. సాగదీత ధోరణితో వ్యవహరిస్తుండడంతో ఏపీ ప్రభుత్వానికి అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా రిజర్వ్ బ్యాంకు నుంచి ఇప్పటివరకు 6,050 కోట్ల రుణాన్ని పొందిన ఏపీ.. ఇందులో తొలి మూడు విడతల్లో రూ.1,500 కోట్ల చొప్పున రూ.4500 కోట్లను రుణంగా తీసుకుంది. ఆ తర్వాత నాలుగో విడతలో రూ.800 కోట్లు, ఐదో విడతలో రూ.750 కోట్ల రుణం తీసుకుంది. ఇక తాజా దరఖాస్తు కోసం ఆర్జీ పెట్టుకున్న నేపథ్యంలో.. ఏపీ దరఖాస్తుపై రిజర్వ్ బ్యాంకు ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications