వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సినేషన్ లో ఏపీ మరో ఘనత -కేంద్ర లక్ష్యం మేరకు : ఓమిక్రాన్ వేళ కీలక అడుగు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ లో కేంద్ర లక్ష్యాన్ని చేరుకుంది. తిరిగి కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేళ..వ్యాక్సినేషన్ పూర్తి చేయటం ద్వారా వరైస్ ను నియంత్రించగలుగుతామని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రం సైతం ఏపీ ప్రభుత్వానికి లక్ష్యాన్ని నిర్దేశించింది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన 3,95,22,000 మందికి టీకా వేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించగా.. ఏపీ ప్రభుత్వం దీనిని అధిగమించింది. 3,95,65,253 మందికి రాష్ట్ర ప్రభుత్వం తొలిడోసు టీకా పంపిణీ పూర్తిచేసింది.

వంద శాతం తొలి డోసు పూర్తి

వంద శాతం తొలి డోసు పూర్తి

గత జనవరి 16న దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత వ్యాక్సిన్ల సరఫరా విషయంలో ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రానికి లేఖలు రాసింది. ఆ తరువాత సరఫరా మెరుగవ్వటంతో వంద శాతం లక్ష్యాన్ని సాధించింది. 10 జిల్లాల్లో కేంద్రం నిర్దేశించిన లక్ష్యం వంద శాతం పూర్తికాగా.. అదనంగా ఇంకా టీకా పంపిణీ నడుస్తోంది. వైఎస్సార్‌ కడప జిల్లాలో 99.92 శాతం, విశాఖపట్నంలో 99.77, కృష్ణా జిల్లాలో 98 శాతం మందికి తొలిడోసు టీకా వేశారు. కొందరు అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సినేషన్‌ ఆలస్యమైంది. కానీ, వీరు ఎక్కడున్నారో గుర్తించి టీకా వేసేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. తొలి డోసు వేసుకున్న వారిలో 74.08 శాతం మందికి వ్యక్తిగత లెక్కల ప్రకారం చూస్తే 2,93,11,443 మందికి రెండో డోసు టీకా వేశారు.

74 శాతానికి పైగా రెండో డోసు

74 శాతానికి పైగా రెండో డోసు

ఇక, ఇప్పుడు ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేల..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వస్తున్న వారిని గుర్తించటం.. పరీక్షలు నిర్వహించటం .. వారి కాంటాక్టుల పైన ఆరా తీయటం..నివేదిక ఆధారంగా వారికి చికిత్స అందించే విధంగా జిల్లా యూనిట్ గా నిర్వహిస్తోంది. నెలలో ఇప్పటివరకూ 43,539 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. వీరిలో 41,654 మందిని గుర్తించారు. 40,937 మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా 40,175 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. 671 ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇప్పటికి విదేశీ ప్రయాణికులు, వారి సన్నిహితులు 106 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా వీరిలో 16 మందికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. ఇక, ఇంటింటా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేను ముమ్మరం చేసింది.

ఒమిక్రాన్ వేళ టీనేజర్లకు టీకాలు

ఒమిక్రాన్ వేళ టీనేజర్లకు టీకాలు


ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,22,57,110 మందిని వైద్య సిబ్బంది సర్వేచేశారు. వీరిలో కరోనా అనుమానిత లక్షణాలున్న 4,219 మందిని గుర్తించారు. 1,260 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక, వ్యాక్సిన్లు తీసుకున్న వారిలోనూ ఇప్పుడు కరోనా లక్షణాలు.. ఒమిక్రాన్ బయట పడుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. కరోనా ఆంక్షలు అమలు చేయాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరో నాలుగు రోజుల్లో 15-18 ఏజ్ గ్రూపు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

వైరస్ వ్యాప్తి వేళ..కొత్త మార్గదర్శకాలు

వైరస్ వ్యాప్తి వేళ..కొత్త మార్గదర్శకాలు

దీని కోసం రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఈ ఏజ్ గ్రూపుల వారీగా లెక్కలు సిద్దం చేసిన ఆరోగ్య శాఖ ఆ మేర వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది. వ్యాక్సినేషన్ ను వేగంగా పూర్తి చేయాలని ప్రభుతకవం ఆదేశించింది. అదే సమయంలో ప్రజలు సైతం మాస్కు ధరించటం.. సోషల్ డిస్టన్స్ పాటించటం వంటి విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వం సూచిస్తోంది.

English summary
AP Govt completed 100 percent first dose vaccination and 74 percentage in second dose.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X