గ్రామ సచివాలయాల్లోనే పాస్‌పోర్టు : పాన్ కార్డు - ఆధారాలు సైతం: రైల్వే టిక్కెట్లు ఇక..!!
ఏపీలోని గ్రామ - వార్డు సచివాలయాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. ఇప్పటి వరకు స్థానికంగా ఉండే అవసరాలకు అనుగుణంగా సేవలను అందిస్తున్న సచివాలయాల్లో పలు కేంద్ర ప్రభుత్వ సేవలు, మరికొన్ని కమర్షియల్ సేవలు సైతం పొందే ఏర్పాట్లు జరిగాయి. గ్రామాల్లో..చిన్న పాటి పట్టణాల్లో ఉండేవారికి ఇప్పటి వరకు పాస్‌పోర్టు పొందాలంటే నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందునా ముందుగా అన్‌లైన్‌లో ఎలాంటి తప్పుల్లేకుండా పాస్‌పోర్టుకు దరఖాస్తు (స్లాట్ బుకింగ్) చేయాలి.

గ్రామ సచివాలయాల్లోనే పాస్‌పోర్టు
కొంత మంది పాస్‌పోర్టు పొందేందుకు దళారీ వ్యవస్థను ఆశ్రయిస్తున్నారు. ఇక, ఇప్పుడు గ్రామాల నుంచి పట్టణాల వరకు అటువంటి ఇబ్బందులకు ముగింపు చెప్పేలా.. గ్రామ సచివాలయాల్లోనే పాస్‌పోర్టు అందించే సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాటుగా పాన్‌కార్డు, రైల్వే టిక్కెట్ బుకింగ్ వంటి కొన్ని కేంద్ర ప్రభుత్వ సేవలు కూడా సచివాలయాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా ఎల్‌ఐసీ ప్రీమియమూ సైతం చెల్లింపు కోసం ఒప్పందం జరిగింది. ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సచివాలయాల్లో 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల పలు కేంద్ర ప్రభుత్వ సేవలు, మరికొన్ని కమర్షియల్ సేవలు సైతం సచివాలయాల ద్వారా పొందే ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది.

545 రకాల సేవలతో
ఈ సర్వీసులను అందించేందుకు సచివాలయాల్లో కొత్త సేవల గురించి ‘సిటీజన్ ఔట్ రీచ్' పేరుతో ప్రతి నెలా రెండు రోజుల పాటు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్టున్నారు. దాదాపు 500 సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్ సేవలందుతున్నాయి. కొత్తగా మరో 2,500 సచివాలయాల్లో ప్రారంభించనుంది. జూన్ నుంచి ప్రతి 5 సచివాలయాల్లో ఒకటి చొప్పున మొత్తం 3 వేల సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి వసాయి. ఇందుకోసం ఒక ల్యాప్‌టాప్, ఐ- స్కానర్, బయోమెట్రిక్ డివైస్ తో కూడిన ఆధార్ కిట్‌లను సచివాలయాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మే నెలాఖరుకలా ఆధార్ కిట్లు చేరతాయని అధికారులు చెప్పారు.
Recommended Video


ఆధార్ క్యాంపుల నిర్వహణ
రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపుల నిర్వహణకు కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. కే ఆధార్ నమోదు చేసుకొన్న పిల్లలకు బయోమెట్రిక్ ఆధునీకరణ వంటి సేవలను ఈ క్యాంపుల ద్వారా అందించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా అధికారులు చెబుతున్నారు. అయితే, పాస్‌పోర్టు - ఆధార్ - పాన్ కార్డు వంటి సేవలను సైతం సచివాలయాల ద్వారా అందుబాటులోకి తీసుకురావటం ద్వారా గ్రామాల్లోని యువతకు మరింత ప్రయోజనకంగా ఉంటుందనే ఆలోచనతో వీటిని అందుబాటులోకి తెచ్చామని అధికారులు పేర్కొంటున్నారు












Click it and Unblock the Notifications