కొత్త రేషన్ కార్డులు వీరికే, దరఖాస్తులు - మార్గదర్శకాలు..!!
ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో జారీ చేసిన కార్డులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో లబ్దిదారులు కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు. జనవరిలోనే కొత్త కార్డులు పంపిణీ చేయాలని భావించినా.. అమలు కాలేదు. దీంతో, ఇప్పుడు కొత్తగా డిజిటల్ రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ పైనా అధికారికంగా నిర్ణయం వెల్లడించనున్నారు. ఉగాది నుంచి కొత్త కార్డుల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త రేషన్ కార్డులు
ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు. వైసీపీ హయాంలో నే భారీగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించాలి నిర్ణయించింది. పాత రేషన్ కార్డులు వైసీపీ రంగుల్లో ఉండ టంతో వాటిని రద్దు చేయనున్నారు. కొత్త డిజైన్లతో, రాజముద్రతో పూర్తిగా డిజిటల్ కార్డుల జారీకి రంగం సిద్దమైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రతిపాదిక కావటంతో పథకాల లబ్దిదారులు కొత్త రేషన్ కార్డుల కోసం ముందుకొస్తున్నారు. సూపర్ సిక్స్ పథకా లకు తాజా బడ్జెట్ లో ప్రభుత్వం నిధులు కేటాయించనుంది. దీంతో, పథకాల్లో లబ్దిదారులుగా ఉండేందుకు కొత్త రేషన్ కార్డుల కోసం డిమాండ్ పెరుగుతోంది.

డిజిటల్ కార్డులు
గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డుల ప్రక్రియ పూర్తి చేయలేదు. కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం దక్కలేదు. దీంతో, మార్పులు.. కొత్తగా పెళ్లైన వారికి కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభు త్వం నిర్ణయించింది. సచివాలయాలతో పాటుగా ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా డిసెంబర్ 28వ తేదీ వరకూ రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం ఇవ్వనున్నారు. క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్‌తో నూతన రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకూ 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉండగా.. ఉన్నాయి. కొత్తగా పెళ్లైన వారి నుంచి అందిన అప్లికేషన్లు సుమారు 70 వేలకు పైగా ఉన్నాయి.
మార్గదర్శకాలపై కసరత్తు
అదే విధంగా కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు, చేర్పులతో కూడా కలిపి 2 లక్షల రేషన్ కార్డులు జారీ చేయాలని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడు రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య సుమారు 1.50 కోట్లకు చేరుతుంది. సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియ స్టార్ట్ కానుంది. క్యూఆర్ కోడ్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నారు. ఎక్కడ ఉన్నా రేషన్ పొందే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. అర్హతల ఖరారు పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉగాది లోగా మార్గదర్శకాలను ఖరారు చేసి.. దరఖాస్తుల ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications