నో బ్యాగ్ డే- ఉపాధ్యాయుల బదిలీలపై కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఇకపై ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని నిర్ణయించారు. అతి త్వరలోనే చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టంపైనా ప్రభుత్వం సమీక్ష చేసింది. జీవో 117 ఉపసంహరణపై అందరి అభిప్రాయలు తీసు కొని ఆమోద యోగ్యమైన పరిష్కారం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో ఇక నుంచి ప్రతీ శనివారం నో బ్యాగ్ డే అమలు కానుంది. ఈ మేరకు తాజాగా మంత్రి లోకేష్ నిర్వహించిన సమీక్షలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసేలా నిర్ణయించారు. అదే విధంగా జీవో 117 ఉపసంహరణపై కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాల్లో వెల్లడైన అభిప్రాయాలను మంత్రికి వివరించారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకొని డ్రాపవుట్లు తగ్గించేలా నిర్ణయాలు ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల బదిలీల పైన ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్థారించేందుకు అపార్ ఐడీని అనుసంధానించే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని మంత్రి లోకేష్ అదేశించారు.

ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్ ల స్థానంలో ఒకటే యాప్ ను త్వరగా అందుబాటు లోకి తీసుకురావాలని మంత్రి నిర్దేశించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం అతి త్వరలోనే ఏపీ మోడల్ ఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ పైన పలు సూచనలు చర్చకు వచ్చాయి.ఇంటర్మీడియట్ విద్యాశాఖలో చేపట్టబోయే సంస్కరణలపైనా సమావేశంలో చర్చించారు. జీవో నెంబర్ 117 పైనా చర్చించారు. ఉపాధ్యాయ బదిలీ చట్టంపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని డిసైడ్ అయ్యారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం లోగా సంస్కరణల అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications