వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభను తాకిన ఇంగ్లీషు మీడియం రచ్చ: నిర్ణయం మార్చుకోవాలి: కేంద్రం సూచించాలి..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీషు మీడియం స్కూళ్ల వ్యవహారం ఇప్పుడు రాజ్యసభను తాకింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజే టీడీపీ ఎంపీ కేశినేని ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనికి వైసీపీ ఎంపీ రఘురామ రాజు స్పందించారు. ఇంగ్లీషు మీడియం స్కూళ్లు అమలు చేస్తున్నా..తెలుగు భాషకు ప్రాధాన్యత దక్కకుండా ఏపీ ప్రభుత్వం చూస్తుందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో కేంద్ర మంత్రి సైతం తాము తెలుగు భాష కోసం ఏ రకంగా నిర్ణయాలు తీసుకుందీ వివరించారు. ఇప్పుడు, అదే అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది.

వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఇంగ్లీషు మీడియం స్కూళ్లు: జీవో విడుదల చేసిన ఏపీ సర్కార్వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఇంగ్లీషు మీడియం స్కూళ్లు: జీవో విడుదల చేసిన ఏపీ సర్కార్

ప్రస్తావించిన టీడీపీ..బీజేపీ సభ్యులు
వచ్చే ఏడాది నుండి ఏపీలో ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు అమలు చేయాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించిన అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు..టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఈ అంశాన్ని లేవనెత్తారు. కోరారు. తెలుగు భాషలో చదివినవారు కూడా.. ఆ తర్వాత ఆంగ్లంలో ప్రావీణ్యం పొందారని ఎంపీలు గుర్తుచేశారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చేలా.. ఏపీ ప్రభుత్వానికి సూచించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఎంపీలిద్దరూ విజ్ఞప్తి చేశారు. జీవోను సవరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు.

Ap Govt English medium schools implementation decision raised in Rajyasabha

ముఖ్యమంత్రి మాత్రం అదే మాట మీద..
ఇదే అంశం మీద ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం పట్టుదలతో కనిపిస్తున్నారు. దీని మీద విమర్శలు చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ వ్యవహారం మీద స్పందనలో భాగంగానే పవన్ కళ్యాన్ ముగ్గురు భార్యలకు..నలుగురో అయిదుగురో పిల్లలున్నారు..వారు ఏ స్కూళ్లో చదువుతున్నారంటూ ప్రశ్నించారు. అదే సమయంలో చంద్రబాబు..వెంకయ్య నాయుడు పిల్లలు గురించి నిలదీసారు. ఇది..రాజకీయంగా రగడకు కారణమైంది. అయితే తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఇంగ్లీషు మీడియం స్కూళ్ల అమలు కు ఆమోద ముద్ర వేసారు. అదే విధంగా తెలుగు సబ్జెక్టు తప్పని సరిగా నిర్ణయించారు. ఇక, ఈ రోజు సైతం ముఖ్యమంత్రి ఏపీలో ఇంగ్లీషు మీడియం స్కూళ్లు అమలు చేస్తామని..ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకే వెళ్తామని ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పారు.

English summary
AP govt English medium schools decision his Rajyasabha. Both BJP and TDP members asked central govt to suggest AP Govt to cahnge this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X