శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరోనా మొబైల్ టెస్టింగ్ సెంటర్లు- ముందు జాగ్రత్త కోసమేనా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో 11 జిల్లాల్లో పలుచోట్ల కేసులు మోదవుతున్నాయి. కానీ రెండు జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికార యంత్రాంగంతో పాటు సాధారణ జనం సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయాలన్న నిర్ణయం మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎలాంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా మొబైల్ టెస్టింగ్ విస్క్ లను ఏర్పాటు చేస్తోంది.

 ఉత్తరాంధ్రలో మొబైల్ విస్క్ లు...

ఉత్తరాంధ్రలో మొబైల్ విస్క్ లు...


ఏఫీలో ఇప్పటివరకూ ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాని ఉత్తరాంద్ర జిల్లాల్లో ప్రభుత్వం ప్రత్యేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మిగతా జిల్లాలతో పోలిస్తే ఇక్కడ బాధితులు లేకపోయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడ మొబైల్ విస్క్ లను ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్ధితుల్లో కరోనా అనుమానితులను అక్కడికక్కడే పరీక్షించేందుకు వీలుగా ఈ విస్క్ లు ఉపయోగపడనున్నాయి.

 అనుమానితులకు అత్యవసర పరీక్షలు..

అనుమానితులకు అత్యవసర పరీక్షలు..

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు నమోదు కాకపోయినప్పటికీ ప్రభుత్వం, అధికారులు మాత్రం పలు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదైన విశాఖ నుంచి లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక్కసారిగా జనం ఈ రెండు జిల్లాలకు రాకపోకలు సాగించే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే అత్యవసర పరిస్ధితుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఈ మొబైల్ విస్క్ లను వాడబోతున్నారు.

ఉత్తరాంధ్రలో లాక్ డౌన్ ఎత్తేసే అవకాశం

ఎల్లుండి తర్వాత ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని, రెడ్ జోన్లు లేని ఉత్తరాంధ్ర జిల్లాల్లో లాక్ డౌన్ సడలించే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఆ తర్వాత విశాఖతో పాటు ఒడిశాలోని సరిహద్దు ప్రాంతాలకు ఇక్కడి ప్రజలు రాకపోకలు సాగించే వీలు దొరుకుతుంది. అయితే అత్యవసర పరిస్ధితులు ఎదురొనప్పుడు మొబైల్ విస్క్ లను అక్కడికి తరలించి బాధితులకు పరీక్షలు నిర్వహించేందుకు, క్వారంటైన్ లో పెట్టేందుకు సైతం ఈ విస్క్ లు ఉపయోగపడనున్నాయి.

Recommended Video

PM Modi Address Nation By Tomorrow 10 AM, Following Jagan on Lock Down Extension

English summary
andhra pradesh govt establishes covid 19 mobile testing wisks in northern andhra districts. in these wisks officials can test covid 19 patients initially and send them to quarantine centres or hospitals depending upon the seriousness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X