AP Govt: ఏపీలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సర్కార్ కీలక ఆదేశాలు..!
ఏపీలో లే అవుట్ల క్రమబద్దీకరణ (Layout Regularisation) విషయంలో ప్రభుత్వం (AP Govt) మరోసారి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో చేపట్టిన లేఅవుట్ల క్రమబద్దీకరణ ప్రక్రియపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ టౌన్ ప్లానింగ్ అధికారులు,మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాు ఇచ్చారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసే విషయంపై మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో మంత్రి నారాయ సమీక్షించారు. ఈ నెల 23తో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల్ని పారదర్శకంగా ఆమోదించాలని ఆయన అధికారులకు సూచించారు. మిగిలిన దరఖాస్తులపైనే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంకా ఆమోదించకపోవడంపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యయంలో .. దరఖాస్తుదారులకు ఇబ్బంది లేకుండా వెంటనే పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియను పలుమార్లు పొడిగించారు. తద్వారా రాష్ట్రంలో అనధికారిక లేఅవుట్లు లేకుండా చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు.














Click it and Unblock the Notifications