మాజీమంత్రి కొల్లు రవీంద్రపై కక్షసాధింపు, గోడ దూకారని అసత్య ప్రచారం: దేవినేని ఉమా ఫైర్

మాజీమంత్రి కొల్లు రవీంద్రపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధిస్తోందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. బీసీ నేతపై కుట్ర పన్ని, హత్య కేసులో ఇరికించారని మండిపడ్డారు. వాస్తవానికి కొల్లు రవీంద్రకు మోకా భాస్కరరావు హత్య కేసులో సంబంధం లేదు అని అధికారులే చెబుతున్నారని దేవినేని ఉమా అన్నారు. కొల్లు రవీంద్ర గోడ దూకి పారిపోయారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రవీంద్ర వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని దేవినేని ఉమా ధ్వజమెత్తారు. కొల్లు రవీంద్ర ఎలాంటివారో అందరికీ తెలుసు అని ఉమా గుర్తుచేశారు.

సీసీటీవీ ఫుటేజీ..

సీసీటీవీ ఫుటేజీ..

కొల్లు రవీంద్ర విశాఖపట్టణానికి బయల్దేరారని ఉమా చెప్పారు. కానీ పారిపోయాడని అవాస్తవాలు ప్రచారం చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కొల్లు రవీంద్ర గోడ దూకి వెళ్లారని అంటోన్న వారు ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించాలని కోరారు. అక్రమ అరెస్టులు సరికాదని, టీడీపీ నేతలు భయపడబోరని పేర్కొన్నారు. మోకా భాస్కర్ రావు హత్య జరిగిన 4 గంటల్లోనే కొల్లు రవీంద్రను ఏ-4 చేర్చారని గుర్తుచేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని.. ఎఫ్ఐఆర్‌లో రవీంద్ర పేరు చేర్చిన సంగతిని కూడా గోప్యంగా ఉంచారని తెలిపారు. మోకా భాస్కర్ రావు హత్య కేసు వివరాలను ఎందుకు చెప్పడం లేదని దేవినేని ఉమా ప్రశ్నించారు.

నడిరొడ్డుపై హత్య..

నడిరొడ్డుపై హత్య..

గత సోమవారం ఉదయం 11.30 గంటలకు బందర్ నడిబొడ్డున మోకా భాస్కర్ రావు హత్యకు గురయ్యారు. కోనేరు సెంటర్ సమీపంలో చేపల మార్కెట్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు భాస్కర్ రావును కత్తితో పొడిచారు. తరవాత ఇద్దరు నిందితులు సహా హత్య చేయించారని భావిస్తోన్న చింతా చిన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా మాజీమంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హత్య చేశామని తెలిపారు.

అరెస్ట్..

అరెస్ట్..


కొల్లు రవీంద్ర గూడూరు పోలీసు స్టేషన్ వద్ద ప్రత్యక్షమయ్యారు. అతని కోసం పోలీసులు గాలింపు విసృతం చేయగా.. తుని వద్ద కనిపించగా.. అటు నుంచి గూడురు పీఎస్‌కు తరలించారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో రవీంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు.

ఎదగడం ఓర్వలేకేనా..?

ఎదగడం ఓర్వలేకేనా..?

మంత్రి పేర్ని నాని కుటుంబానికి మోకా భాస్కరరావు కుటుంబం అండగా ఉంటోంది. భాస్కరరావు తండ్రి మోకా రామయ్య.. పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తికి అనుచరుడిగా ఉన్నారు. రామయ్య కౌన్సిలర్‌గా పనిచేశాడు. తర్వాత భాస్కర్ రావు తన భార్యను కౌన్సిలర్ చేశాడు. భాస్కరరావు మత్య్సకార కుటుంబానికి చెందినవారు. తన సామాజిక వర్గ సమస్యల కోసం పాడుపడుతున్నారు. మచిలీపట్నం మార్కెట్ కమిటీకి రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయంగా ఎదగడంతో ప్రత్యర్థులు హత్య చేశారని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+