ఏపీలో పారామెడికల్ కోర్సులకు ఫీజు ఖరారు చేసిన జగన్ సర్కార్ -పూర్తి వివరాలివే
ఆంధ్రప్రదేశ్ లో నర్సింగ్, ఆయూష్ విభాగాలతో పాటు వివిధ పారామెడికల్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు ఖరారు చేసింది. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ఆయా కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు ఇచ్చారు. 2020-21 నుంచి 2022-23 సంవత్సరాలకు ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఆయా కోర్సులకు ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి..
బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు:
కన్వీనర్ కోటా: రూ. 18 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 80 వేలు

పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు:
కన్వీనర్ కోటా: రూ. 18 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 80 వేలు
ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సుకు:
కన్వీనర్ కోటా: రూ. 83 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 1.49 లక్షలు
బీపీటీ కోర్సుకు:
కన్వీనర్ కోటా: రూ. 18 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 80 వేలు
ఎంపీటీ కోర్సుకు:
కన్వీనర్ కోటా: రూ. 94 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 1.60 లక్షలు
బీహెచ్ఎంఎస్ కోర్సుకు:
కన్వీనర్ కోటా: రూ. 22 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 3 లక్షలు
బీఎస్సీ-ఎంఎల్టీ కోర్సుకు:
కన్వీనర్ కోటా: రూ. 18 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 80 వేలు
డీఎంఎల్టీ, పారామెడికల్ డిప్లమో కోర్సులు:
కన్వీనర్ కోటా: రూ. 14 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 45 వేలు
జీఎన్ఎం కోర్సులు:
కన్వీనర్ కోటా: రూ. 15,500
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 72 వేలుగా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications