వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో ఏపీని పురోగతి దిశగా అడుగులు వేయించే కార్యక్రమాన్ని చేపట్టింది. పారిశ్రామికంగా ఏపీ ప్రగతి సాధిస్తే, తద్వారా ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం అనేక కంపెనీలను ఏపీకి స్వాగతిస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ సర్కార్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేని యువత ఉండకుండా తనవంతు ప్రయత్నం చేస్తుంది.
20 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యం పెట్టుకోవాలన్న మంత్రి
ఈ క్రమంలో తాజాగా వచ్చే ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని ఏపీ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు సెర్ప్ మరియు ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నేడు మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి (APEDB) నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యుత్తమ చిరునామాగా ఏపీ
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం చేరుకోవడంలో ఏపీఈడీబీ పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ పెద్ద లక్ష్యం విజయవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యుత్తమ చిరునామాగా మార్చే ప్రక్రియలో భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
రాబోయే ఐదేళ్లలో ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. నిరుద్యోగులకు మనం ఇచ్చిన హామీ మేరకు రాబోయే ఐదేళ్లలో లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, ఆ తర్వాతి కాలంలో అంతకు మించిన విజయాలను నమోదు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ లక్ష్య సాధన కోసం జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి
కింది స్థాయిలో MSME గురించి అవగాహన కల్పించాలని, ఇందుకోసం కలెక్టర్లతో పాటు అన్ని శాఖల సహకారం తీసుకుని సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు పటిష్టం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు కావాల్సిన సంపూర్ణ సహకారం అందిస్తోందని ఆయన తెలిపారు. ఇది గుర్తించే ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఇది మనమందరం గర్వించాల్సిన విషయం అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయంలో కష్టపడుతోన్న సంబంధిత శాఖాధికారులను కూడా మంత్రి అభినందించారు.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!













Click it and Unblock the Notifications