బెడిసికొట్టిన టీడీపీ ప్లాన్: వైసీపీని ఇరికించబోయి - రాజ్యసభ సాక్షిగా..!!

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దాడికి దిగడానికి ప్రతిపక్ష తెలుగుదేశం సాగిస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలితాన్నిచ్చినట్టు కనిపించట్లేదీ మధ్య. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు జనంలోకి వెళ్లట్లేదనేది బహిరంగ రహస్యం. ఇదివరకు కర్నూలు, ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన సభలు, రోడ్ షోలకు మిశ్రమ స్పందనే లభిస్తోందని చెబుతున్నారు.

బహిరంగ సభలతో..

బహిరంగ సభలతో..

అదే సమయంలో మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చిన రెండు బహిరంగ సభలు భారీగా విజయవంతం కావడం- టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టిందనే వాదనలు లేకపోలేదు. కార్యనిర్వాహక రాజధాని కోసం నాన్ పొలిటికల్ జేఏసీ తొలుత ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. దీని తరువాత న్యాయ రాజధాని కావాలనే డిమాండ్‌తో అదే పొలిటికల్ జేఏసీ రాయలసీమలోని కర్నూలులో ఏర్పాటు చేసిన సభ కూడా అదే ఫలితాన్ని ఇచ్చింది.

టీడీపీ బూమరాంగ్..

టీడీపీ బూమరాంగ్..

ఈ రెండు సభలు విజయవంతం కావడం- టీడీపీని కొంత ఇరకాటంలోకి నెట్టినట్టయింది. దీనితో ఒకవంక ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తూనే మరోవంక- పార్లమెంట్ సాక్షిగా వైఎస్ఆర్సీపీని ఎండగట్టాలనే టీడీపీ ప్రయత్నం బూమరాంగ్ అయింది. అది కాస్తా బెడిసి కొట్టింది. 2014-2019 మధ్యకాలంలో రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న లోపాలను ఎత్తి చూపించినట్టయింది.

విజయవాడ మెట్రో రైలుపై..

విజయవాడ మెట్రో రైలుపై..

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2017లో విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలేవీ కేంద్రానికి అందలేదు. ఈ విషయం ఇప్పుడు బహిర్గతమైంది. కేంద్ర ప్రభుత్వం కోరినప్పటికీ- విజయవాడలో మెట్రో రైల్ స్థాపనకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) గానీ, రివైజ్డ్ ప్రతిపాదనలను గానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పంపించలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా వెల్లడించింది.

కనకమేడల అడిగిన ప్రశ్నకు..

కనకమేడల అడిగిన ప్రశ్నకు..

తెలుగుదేశం పార్టీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఇవ్వాళ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్ కిశోర్ ఈ మేరకు ఈ సమాధానం ఇచ్చారు. మెట్రో పాలసీ 2017కు అనుగుణంగా విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం 2017లో ఏపీ ప్రభుత్వం రివైజ్డ్ ప్రతిపాదనలను పంపించిందా? పంపకపోతే దీనికి గల కారణాలేమిటీ?, ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వమే అండర్ టేక్ చేస్తుందా? అంటూ ఆయన అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

లిఖితపూరక సమాధానం..

లిఖితపూరక సమాధానం..

మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ఆల్టర్నేటివ్ అనాలసిస్ రిపోర్ట్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు 2017 సెప్టెంబర్ 1వ తేదీన తమకు పంపించాయని, ఏపీ ప్రభుత్వం నుంచి అలాంటి ప్రతిపాదనలేవీ తమకు అందలేదని మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. 2017 మెట్రో రైలు పాలసీకి అనుగుణంగా రివైజ్డ్ ప్రతిపాదనలను అందజేయాలని సూచించినప్పటికీ.. అవి సబ్మిట్ చేయలేదని లిఖితపూరక సమాధానం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+