పెన్షన్లపై కలెక్టర్లకు ఏపీ సర్కార్ వార్నింగ్..! సోషల్ పోస్టులు కనిపిస్తే..!

ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు పింఛన్లను అధికారంలోకి రాగానే పెంచింది. అప్పటి నుంచీ పెంచిన పెన్షన్లే అందుతున్నాయి. అలాగే వివిధ కేటగిరీల్లో పెన్షనర్లను అర్హతల ఆధారంగా కొనసాగించడం లేదా తొలగించడం చేస్తున్నారు. అయితే అర్హత ఉన్న పెన్షనర్లను కూడా అర్హుల జాబితాలో నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎస్ విజయానంద్ ఇవాళ జిల్లా కలెక్టర్లకు తీవ్ర హెచ్చరికలు చేశారు.

అర్హత ఉన్నప్రతి ఒక్కరికీ ఫించన్ అందాలని, అర్హత ఉండి పెన్షన్ రాలేదంటే కలెక్టర్లదే బాధ్యతని సీఎస్ విజయానంద్ తేల్చిచెప్పేశారు. రాష్ట్రంలో అర్హతగల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఫించన్ అందించాలని, ఎక్కడైనా అర్హత ఉండి ఫించన్ రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధిత జిల్లా కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.

AP Govt Holds Collectors Accountable for Missing Eligible Pensioners

అర్హత గల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ స్పష్టంచేశారు. ప్రతినెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా,మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అర్హత గల వారందరికీ తప్పనిసరిగా ఫించన్ అందేలా చూడాలన్నారు. అర్హత ఉన్నా పెన్షన్ రాలేదని మీడియా, సోషల్ మీడియా లేదా మరే ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలెక్టర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎస్ హెచ్చరించారు.

AP Govt Holds Collectors Accountable for Missing Eligible Pensioners

పెన్షన్ల తనిఖీకి సంబంధించి లక్షా 35 వేల మందికి నోటీసులు జారీ చేసి నెలరోజుల్లోగా ఎంపీడీవోలకు అప్పీలు చేసుకోవాలని తెలియజేస్తే.. వారిలో 88వేల 319 మంది ఎంపీడీవోలకు అప్పీలు చేసుకున్నారని సీఎస్ తెలిపారు. ఇంకా 23వేల మంది అప్పీలు చేసుకోలేదని, నెలరోజుల గడువులోపు అప్పీళ్ళన్నీ పరిష్కరించాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు. పెన్షన్ల పంపిణీపై ఎక్కడా నెగిటివ్ ప్రచారం జరగకుండా చూసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+