ఉద్యోగ సంఘాలకు మరోసారి ఆహ్వానం- ఈ రోజే సీఎంతో సమావేశం : ఫిట్ మెంట్ ఫైనల్..!!

ఏపీ ఉద్యోగులు నిరీక్షిస్తున్న పీఆర్సీ పైన ఈ రోజు నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. గురువారమే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రకటిస్తారని భావించినా... ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం బుజ్జగింపు తరహాలో రాష్ట్ర పరిస్థితిని వివరించారు. రాష్ట్రంలో ఆదాయం.. రెవిన్యూ పరిస్థితిని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల కుటుంబ సభ్యుడిగా తాను చేయగలిగినంత మేలు చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన అంశాలు అన్నింటినీ జాగ్రత్తగా విన్న సీఎం..అన్నీ నోట్ చేసుకున్నానని చెబుతూ.. ఖచ్చితంగా ఉద్యోగులకు మేలు చేయటానికే ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

చెప్పిన సమయం కంటే ముందుగానే

చెప్పిన సమయం కంటే ముందుగానే

తెలంగాణ పీఆర్సీతో పోలిక వద్దని సూచించారు. సీఎంతో సమావేశానికి ముందు వరకు ఉద్యోగ సంఘాలు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారు సిఫార్సులు అంగీకరించమని.. ఐఆర్ కు తగ్గకుండా ఫిట్ మెంట్ ఉండాలని స్పష్టం చేసారు. సీఎంతో సమావేశం సమయంలోనూ ఇదే విషయాన్ని సీఎంకు నివేదించారు. దీంతో..27 శాతం ఐఆర్ అమలు తరువాత ప్రభుత్వం పైన ఒకేసారి రూ 18 వేల కోట్ల మేర భారం పెరిగిందని సీఎం చెప్పుకొచ్చారు. అదే సమయంలో అయిదు డీఏలు పెండింగ్ ఉన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు.

ఈ రోజు ప్రకటన చేస్తారా

ఈ రోజు ప్రకటన చేస్తారా

ఉద్యోగులు చెప్పిన అంశాల పైన..సీఎం జగన్ సీఎస్ తో సహా ఆర్దిక శాఖ అధికారులతో పలు మార్లు భేటీ అయ్యారు. చివరకు ఫిట్ మెంట్ ఎంత ఇవ్వాలనే దాని పైన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో.. రెండు మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన సీఎం.. ఈ మధ్నాహ్నమే ఆ ప్రకటన చేసేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం మధ్నాహ్నం సీఎంతో సమావేశానికి రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలకు సీఎంఓ నుంచి ఆహ్వానం అందింది. గురువారం జరిగిన సమావేశంలో ప్రతీ ఉద్యోగ సంఘానికి చెందిన నేతల నుంచి సీఎం అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. తిరిగి వారంతా ఈ రోజు మధ్నాహ్నం సమావేశానికి రావాలని ఆహ్వానించారు.

ఫిట్ మెంట్ ఎంతనే దాని పైనే ఆసక్తి

ఫిట్ మెంట్ ఎంతనే దాని పైనే ఆసక్తి

దీంతో..చెప్పిన సమయం కంటే ముందుగానే సీఎం పీఆర్సీ పైన నిర్నయం ప్రకటించేందుకు సిద్దమయ్యారు. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ రోజు ఉద్యోగ సంఘాల వద్ద ప్రభుత్వం ఎంత మేర ఫిట్ మెంట్ ఇవ్వాలని భావిస్తుందో తొలుత వెల్లడించి.. దాని పైన ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకున్న తరువాత సీఎం తుది ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజుతో పీఆర్సీ వ్యవహారానికి ముగింపు పలకాలని సీఎం భావిస్తున్నట్లుగా సమాచారం. దీంతో.. ఈ మధ్నాహ్నం ఉద్యోగ సంఘాలతో సీఎం ఏం చెప్పబోతున్నారు.. ఎంత మేర ఫిట్ మెంట్ ప్రకటిస్తారనే అంశం పైన ఉత్కంఠ నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+