ఏపీలో ఒమిక్రాన్ అలర్ట్- టీనేజర్లకు టీకాలు : ప్రికాషన్‌ డోసులు సిద్దం -ఎవరెవరికి..!!

ఏపీలో మలి విడత టీకాల పంపిణీకి రంగం సిద్దం అయింది. కేంద్రం మార్గదర్శకాల మేరకు జనవరి మూడవ తేదీ నుంచి 15-18 ఏళ్ల పిల్లలకు టీకాలు పంపిణీకి నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా .. ఓమిక్రాన్ కేసుల నేపథ్యంలో కేంద్రం వెంటనే ఈ టీకాల పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెల 25న ప్రధాని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ ప్రకటన చేసారు. అదే విధంగా 60 ఏళ్లు దాటిన వారికి ప్రికాషన్ డోసులు సైతం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో 74.34 లక్షల మందికి టీకా

రాష్ట్రంలో 74.34 లక్షల మందికి టీకా

ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో పాటు వృద్ధులకు ప్రికాషన్‌ డోసు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేర జిల్లాలకు పంపిణీ చేస్తోంది. ఇందు కోసం రిజిస్ట్రేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీ వ్యాప్తంగా రాష్ట్రంలో 74.34 లక్షల మందికి టీకా వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు కోవిడ్‌ టీకా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. జనవరి 3వ తేదీ నుంచి 15-18 ఏళ్ల పిల్లలకు తొలి డోసు వేయనుంది. 10వ తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి, హెల్త్‌కేర్, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు ..వృద్ధులకు ప్రికాషన్‌ డోసు.. పిల్లలకు తొలి డోసు ఇచ్చేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం జిల్లాలకు వ్యాక్సిన్ల సరఫరాతో పాటుగా మార్గదర్శకాలు జారీ చేసింది.

1వ తేదీ నుంచి కోవిన్‌ యాప్‌ లో రిజిస్ట్రేషన్

1వ తేదీ నుంచి కోవిన్‌ యాప్‌ లో రిజిస్ట్రేషన్

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకా పంపిణీకి వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది. 15-18 ఏళ్ల పిల్లలు టీకా కోసం జనవరి 1వ తేదీ నుంచి కోవిన్‌ యాప్‌/పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. టీకా వేసుకునేందుకు అర్హులైన పిల్లలు రాష్ట్రంలో 24,41,000 మంది ఉన్నారు. 60 ఏళ్లు పైబడి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు 29,42,020 మంది, హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 20,51,374 మంది ఉన్నారు. పిల్లలకు కోవాగ్జిన్‌ టీకా మాత్రమే వేస్తారు. 60 ఏళ్లు పైబడి రక్తపోటు, మధుమేహం, కిడ్నీ, గుండె సంబంధిత, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు ప్రికాషన్‌ డోసు తీసుకోవాల్సి ఉంటుందనిఅధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక, టీకా పంపిణీకి ఏర్పాట్లు వైద్య ఆరోగ్య శాఖ పూర్తి చేసింది.

జిల్లాలకు వ్యాక్సిన్ల పంపిణీ

జిల్లాలకు వ్యాక్సిన్ల పంపిణీ

ప్రస్తుతం ఉన్న విధానంలోనే టీకాలు వేసే కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాల్లో ఇప్పటికే 7 లక్షల టీకా డోసులు ఉన్నాయని... కాగా, మరో 10 లక్షలు పంపామని వైద్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీకా పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. కాగా, ఏపీలో అనూహ్యంగా ఒకటే రోజున పది ఓమిక్రాన్ కేసులు రావటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ నిర్దారణ అయినా..తొలి సారి కాంటాక్ట్ స్ప్రెడింగ్ గుర్తించారు. దీని ద్వారా ముగ్గురికి ఒమిక్రాన్ వ్యాపించినట్లుగా నిర్దారించారు. దీంతో..కరోనా ఆంక్షలు అమలు చేస్తూనే... వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+