హెచ్ఆర్ఏ 24 శాతానికి పెంపు - క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లోనూ మార్పులు: ఉత్తర్వులు జారీ..!!
ఏపీ ప్రభుత్వంతో గత వారం ఉద్యోగ సంఘాల తో కుదిరిన ఒప్పందం మేరకు పీఆర్సీలో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఆర్ఏలో మార్పులు చేసింది. ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్ ఓ డి కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు 24 శాతం మేర హెచ్ ఆర్ ఏ ను వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2022 జనవరి 1 తేదీ నుంచి హెచ్ ఆర్ ఏ పెంపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. 11 వ పీఆర్సీ లో 16 శాతం మేర మాత్రమే పెంపు సిఫార్సు చేసినప్పటికీ మంత్రుల కమిటీ తో కుదిరిన అంగీకారం మేరకు 24 శాతం వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

హెచ్ఆర్ఏ పెంచుతూ
అయితే హెచ్ ఆర్ ఏ గరిష్ట పరిమితి 25 వేలకు నిర్ధారిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. ఏపీ భవన్, హైదరాబాద్ లలో పని చేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం హెచ్ ఆర్ ఏ వర్తిస్తుందని పేర్కొన్నారు. 2-50 లక్షల జనాభా ఉన్న పట్టణాలు, 13 జిల్లా కేంద్రాల్లో బేసిక్ పే పైన 16 శాతం హెచ్ ఆర్ ఏ లేదా 17 వేల సీలింగ్ గా నిర్ణయించారు. 2 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 12 శాతం హెచ్ అర్ ఏ నిర్ధారణ 13 వేల రూపాయలు మించకుండా సీలింగ్ విధించారు. ఇక 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 10 శాతం లేదా 11 వేల రూపాయలు మించకుండా హెచ్ ఆర్ ఏ ఇవ్వనున్నారు.

జనవరి నుంచే అమల్లోకి
2024 జూన్ 1 తేదీ వరకు హెచ్ ఆర్ ఏ పెంపు ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అదే విధంగా..కొత్త పీఆర్సీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కెళ్ల ను సవరిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2022 జనవరి నుంచి కొత్త వేతన స్కెళ్లను అమలు లోకి వచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం జజ11 వ పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలు, పెన్షన్ లను నిర్దారిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 2022 నెలకు చెల్లించిన వేతనాల్లో హెచ్చు తగ్గుల ను సవరిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
Recommended Video

క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సైతం పెంపు
ఫిబ్రవరి 2022 నెలకు సంబంధించిన వేతన, పెన్షన్ బిల్లులను సిద్ధం చేయాలని డీడీఓ లకు ఆదేశాలు జారీ చేసింది. సిటీ కంపన్సేటరీ అలవెన్సును కూడా హెచ్ ఓ డీలు, సచివాలయ ఉద్యోగులకు, విశాఖ, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యోగులకు, 13 వేర్వేరు మున్సిపాలిటీ లకు గ్రేడ్ పే ఆధారంగా నిర్ధారణ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక, పెన్షన్ చెల్లింపులో 70 ఏళ్ల దాటిన వారికి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలులో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.












Click it and Unblock the Notifications