వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10,908 వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్లు: 10వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ: జిల్లాల వారీగా ఇలా..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10,908 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా.. ఈ నెల 10 వే తేదీ వరరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. జిల్లాల్లో ఉన్న వాలంటీర్ల పోస్టుల ఖాళీల ఆధారంగా కలెక్టర్లు నోటిఫికేషన్లు విడుదల చేసారు. కనీస విద్యార్హత పదో తరగతిగా నిర్ధారించారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. ఇందు కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ సైతం ప్రారంభించారు. మండలాల వారీగా వాలంటీర్ల ఎంపికకు నవంబర్ 16 నుండి 20 వ తేదీ మధ్య మండల కేంద్రాల్లో ఎంపీడీవో ఆధ్వర్యంలో ముగ్గురు అధికారుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియ షురు.. 2లక్షల మందికి అవకాశం.. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియ షురు.. 2లక్షల మందికి అవకాశం.. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..

జిల్లాల వారీగా ఖాళీలు..
ప్రభుత్వం భర్తీ చేయాలని నిర్ణయించిన గ్రామ వాలంటీర్ల పోస్టుల వివరాలను జిల్లాల వారీగా ప్రకటించింది. దీని ప్రకారం.. శ్రీకాకులంలో 398, విజయనగరం లో 562, విశాఖలో 386, తూర్పు గోదావరి జిల్లాలో 1,309 పోస్టులు, పశ్చిమ గోదావరి లో 1,152, క్రిష్టా జిల్లాలో 1,013, గుంటూరు జిల్లాలో 1,087.. ప్రకాశంలో 878 పోస్టులు, నెల్లూరులో 441, చిత్తూరులో 1,011, కర్నూలు లో 838, వైయస్సార్ కడప జిల్లాలో 799 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా.. అనంతపురం జిల్లాలో 1,034 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. మొత్తగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ 10,908 పోస్టులను ఈ నెలాఖరు లోగా భర్తీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశించింది.

AP govt issued notification for fill up of village volunteer posts nearly 11,000

సచివాలయ ఉద్యోగాలకు వాలంటీర్లు..
ఏపీ ప్రభుత్వం రెండు నెలల క్రితం గ్రామ వాలంటీర్లను నియమించింది .అప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి. కాగా, ప్రభుత్వం గ్రామ.. వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసింది. అందులోనూ ఇంకా అనేక ఖాళీలు ఉన్నాయి. అయితే వాలంటీర్లు చేరిన వారిలో అనేక మంది సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. దీంతో..వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని నిర్ణయం తీసుకుంది. పదో తరగతి దీనికి అర్హతగా నిర్ణయించటంతో ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తోంది. ఇదే సమయంలో మిగిలిపోయిన గ్రామ ..వార్డు సచివాలయ ఉద్యోగాలను సైతం ఈ నెలాఖరులో భర్తీ చేసేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ఇక, జనవరిలో రెగ్యులర్ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో నిరుద్యోగులు ప్రధానంగా ఆ ఉద్యోగాల మీదనే ఫోకస్ చేస్తున్నారు. అందు కోసం కోచింగ్ తీసుకుంటూ..ఆ పరీక్షల కోసం సిద్దం అవుతున్నారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం ఏ స్థాయిలో స్పందన వస్తుందనేది వేచి చూడాల్సిందే.

English summary
AP govt issued notification for fill up of village volunteer posts nearly 11,000. As per vacancies available in districts collectors issued notification. Up to 10th of this month candidates may apply for these posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X