
గ్రామ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ప్రొబేషన్ డిక్లేర్ : కొత్త పీఆర్సీ - జీవో జారీ..!!
ముఖ్యమంత్రి జగన్ మరో హామీ నిలబెట్టుకున్నారు. గ్రామ -వార్డు సచివాలయాల సిబ్బంది ప్రొబేషన్ ప్రకటన పైన ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. జూన్ లో దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇస్తామని సీఎం జగన్ గతంలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా ఈ రోజు జీవో నెంబర్ 5 ద్వారా స్పష్టమైన విధి విధానాలను వెల్లడించారు.

ప్రొబేషన్ ఖరారు ..జూలై నుంచే వేతనాలు
నవరత్నాల పథకాల అమల్లో భాగంగా.. సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో సిబ్బందిని ముందుగా గౌరవ వేతనంతో అప్పాయింట్ చేసుకుంది. వారికి పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు అందులో సెలెక్ట్ అయిన వారికి ప్రొబేషన్ డిక్లేర్ చేయటంతో పాటుగా..జూలై నెల నుంచే వారికి తాజా పీఆర్సీ మేరకు జీతాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. సచివాలయాల్లో పని చేసే 19 రకాల సిబ్బందికి ఈ ఆదేశాలు అమలు అవుతాయి. వారికి కనీసం వేతనం 24 వేల నుంచి గరిష్ఠ వేతరం 74 వేల వరకు ఉండే అవకాశం ఉంది.

ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ఉత్తర్వులు
దీనికి
సంబంధించి
ఇప్పటికే
జిల్లా
కలెక్టర్ల
నుంచి
ఒక్కో
జిల్లాలో
ఎంత
మంది
ఉద్యోగులు
ఈ
విధంగా
ప్రొబేషన్
కు
అర్హత
సాధించారనే
వివరాలను
ప్రభుత్వం
సేకరించింది.
అందులో
భాగంగా..
రాష్ట్ర
వ్యాప్తంగా
1,17,954
మందికి
లబ్ది
జరగనుంది.
దీంత..ఇప్పటి
వరకు
సచివాలయ
ఉద్యోగుల
విషయంలో
ప్రతిపక్షాలు
ప్రభుత్వం
పైన
చేస్తున్న
విమర్శలకు
సమాధానంగా
అధికార
వైసీపీ
భావిస్తోంది.
దీని
ద్వారా
లక్షా
18
వేల
మంది
వరకు
రెగ్యులర్
ఉద్యోగులుగా
మారనున్నారు.

మరిన్ని ఉద్యోగాల ప్రకటన దిశగా
ప్రస్తుతం
ప్రభుత్వంలో
కీలకంగా
మారిన
సచివాలయ
వ్యవస్థలో
ఇప్పుడు
ప్రొబేషన్
ప్రకటన
ద్వారా
సేవలను
మరింతగా
ప్రజలకు
దగ్గర
చేసేందుకు
వీలుగా
ప్రభుత్వం
మరిన్ని
నిర్ణయాలు
తీసుకొనే
అవకాశం
ఉంది.
ఇప్పటికే
జాబ్
క్యాలెండర్
ప్రకటనకు
సమీక్ష
చేసిన
సీఎం...త్వరలో
మరిన్ని
ఉద్యోగాల
భర్తీకి
నిర్ణయం
తీసుకొనే
అవకాశం
కనిపిస్తోంది.
ప్రభుత్వ
ఉద్యోగ
సంఘాలతో
పీఆర్సీ
పైన
చర్చల
సమయంలో
సచివాలయ
ఉద్యోగుల
ప్రొబేషన్
పైనా
చర్చకు
వచ్చింది.
ఆ
సమయంలో
ఇచ్చిన
హామీ
మేరకు
ఇప్పుడు
ప్రభుత్వం
ఉత్తర్వులు
జారీ
చేయటంతో..
ఉద్యోగ
సంఘాల
నేతలు
హర్షం
వ్యక్తం
చేస్తున్నారు.