ఏపీలో బక్రీద్ నిబంధనలు ఇవే: ఉల్లంఘిస్తే..: ఆ ఆనవాయితీని పాటించొద్దు
అమరావతి: ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే బక్రీద్ పర్వదినం సమీపిస్తోంది. ఈ నెల 20, 21 తేదీల్లో ఈ పండుగను జరుపుకోవడానికి ముస్లింలు సన్నాహాలు చేసుకుంటోన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బక్రీద్ పండుగకు సంబంధించిన ప్రత్యేక ప్రార్థనలను జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఖాళీ స్థలాలు, ఈద్గాలతో పాటు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే పరిస్థితులు లేవనే అభిప్రాయాలు ముస్లింలల్లో నెలకొని ఉన్నాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్.. తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. బక్రీద్ సందర్భంగా ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలను నిర్వహించుకోవడానికి ఆంక్షలతో కూడిన అనుమతులను ఇచ్చింది. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్ కొద్దిసేపటి కిందటే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. దీని ప్రకారం.. మసీదుల్లో 50 శాతానికి మాత్రమే అనుమతి ఉంది. భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందనే కారణంతో- బక్రీద్ సందర్భంగా మసీదుల్లో పాక్షికంగా ప్రార్థనలను నిర్వహించుకోవచ్చని తెలిపింది.

50 శాతానికి మించకుండా భక్తులకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది. ఈద్గాలు, ఖాళీ ప్రదేశాల్లో బక్రీద్ ప్రార్థనలను నిర్వహించడాన్ని నిషేధించింది. అలాంటి ప్రాంతాల్లో ప్రార్థనలను నిర్వహించుకోవడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వట్లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. పెద్ద సంఖ్యలో భక్తులు ఒకేచోట గుమికూడటం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమౌతుందని పేర్కొంది. ఈ ప్రార్థనల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులను ధరించాల్సి ఉంటుందని, అలాగే నిర్వాహకులు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించింది.
మసీదుల్లో ప్రార్థనలకు హాజరయ్యే వారు తమవెంట మ్యాట్‌ను తెచ్చుకోవాలని పేర్కొంది. వయోధిక వృద్ధులు, పిల్లలు, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షాణాలు ఉన్నవారు ప్రార్థనలకు వెళ్లొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇంట్లోనే ప్రార్థనలను నిర్వహించుకోవాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్నందున బక్రీద్ పండుగ నాడు ముస్లింలో సంప్రదాయబద్ధంగా ఆళింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపడాన్ని నివారించాలని, ఈద్ మిలాప్ కార్యక్రమాలను నిర్వహించొద్దని స్పష్టం చేసింది.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications