బాలీవుడ్‌లో సంచలనం.. హీరో రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?
బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కాల్సిన 'డాన్ 3' సినిమా ఇప్పుడు తీవ్ర వివాదాల కేంద్రంగా మారింది. స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి అకస్మాత్తుగా తప్పుకోవడంతో, సినీ కార్మికుల సంఘం అయిన Federation of Western India Cine Employees ఆయనపై కఠిన చర్యలకు దిగింది. పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రణ్‌వీర్‌పై 'నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్' జారీ చేసినట్లు ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది.
షూటింగ్‌కు మూడు వారాల ముందే..
అయితే మోస్ట్ అవేటెడ్ మూవీగా గుర్తింపు పొందిన Don 3 చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు Farhan Akhtar తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు, షూటింగ్ ప్లానింగ్, సెట్స్, టెక్నికల్ ఏర్పాట్లు పూర్తవుతున్న సమయంలో రణ్‌వీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడం నిర్మాతలకు భారీ షాక్ ఇచ్చింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, షూటింగ్ ప్రారంభానికి కేవలం మూడు వారాల ముందు హీరో తప్పుకోవడంతో సుమారు ₹45 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సెట్స్, లొకేషన్లు, విదేశీ షెడ్యూల్స్, టెక్నికల్ టీమ్ అడ్వాన్స్‌లు, ప్రీ-విజువలైజేషన్ ఖర్చులు వృథా అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

రంగంలోకి దిగిన FWICE.. కఠిన హెచ్చరిక
ఈ వివాదంపై స్పందించిన FWICE, పరిశ్రమలోని 38 విభాగాలకు చెందిన సుమారు నాలుగు లక్షల మంది కార్మికులు, టెక్నీషియన్లు, కెమెరామెన్లు, లైట్ బాయ్స్, సెట్స్ వర్కర్లు రణ్‌వీర్‌తో పని చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. FWICE ముఖ్య సలహాదారు Ashoke Pandit మాట్లాడుతూ.. "ఒక స్టార్ హీరో అకస్మాత్తుగా సినిమా నుంచి తప్పుకుంటే దాని ప్రభావం కేవలం నిర్మాతపైనే కాదు.. వేలాది మంది సినీ కార్మికుల జీవనోపాధిపై పడుతుంది" అని పేర్కొన్నారు.
మూడు నోటీసులు..
రణ్‌వీర్ సింగ్‌కు ఫెడరేషన్ మూడు సార్లు నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే ఆయన నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు FWICE వెల్లడించింది. ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించినా సహకారం లభించలేదని సంఘం ఆరోపించింది. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTDA) ద్వారా నిర్మాతలు ఫిర్యాదు చేసిన తర్వాతే ఈ వ్యవహారం పెద్దదైందని తెలుస్తోంది.
రణ్‌వీర్ టీమ్ వాదన ఏమిటి?
ఇక ఈ వివాదంపై Ranveer Singh టీమ్ కూడా తమ వాదన వినిపించింది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి 'బౌండ్ స్క్రిప్ట్' తమకు అందలేదని, కథలో స్పష్టత లేకపోవడం వల్లే సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. అంతేకాదు, సినిమా ప్రాజెక్ట్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని, తమకు ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ కూడా అందలేదని వాదించారు. ఇది పూర్తిగా కాంట్రాక్ట్‌కు సంబంధించిన అంశమని, దీనిని పరిష్కరించడానికి FWICE సరైన వేదిక కాదని రణ్‌వీర్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
'డాన్' ఫ్రాంచైజీపై ప్రభావం
అమితాబ్ బచ్చన్‌తో ప్రారంభమైన 'డాన్' ఫ్రాంచైజీకి బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. తర్వాత Shah Rukh Khan హీరోగా వచ్చిన 'డాన్', 'డాన్ 2' సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఆ తర్వాత కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రణ్‌వీర్ సింగ్‌తో 'డాన్ 3' ప్రకటించగా, సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు సినిమా ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకోవడం నిర్మాతలకు తలనొప్పిగా మారింది. రణ్‌వీర్ స్థానంలో మరో హీరోను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
Bollywood Hero #RanveerSingh banned from bollywood for 3 years
— Milagro Movies (@MilagroMovies) May 26, 2026
Ashoke Pandit explains how Ranveer Singh exited Don 3 just 3 weeks before the shoot, causing massive losses to the makers.
According to him, Farhan Akhtar suffered a loss of around ₹45 crore, while technicians,… pic.twitter.com/ndgFK2sTdW
ఈ ఘటన ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక స్టార్ హీరో నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ప్రభావితమవుతున్నారనే చర్చ మొదలైంది. మరోవైపు, నటులకు కూడా సరైన స్క్రిప్ట్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అవసరమేనని కొందరు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం FWICE బహిష్కరణ ఆదేశాలు కొనసాగుతున్నప్పటికీ, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంఘం తెలిపింది. రణ్‌వీర్ సింగ్ చర్చలకు ముందుకు వస్తే, నిర్మాతలు-నటుడు-సంఘం మధ్య రాజీ కుదిరే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications