డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ - ఖాతాల్లో రూ 15 వేలు, మార్గదర్శకాలు..!!
ఏపీ ప్రభుత్వ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వేళ కొత్త డ్వాక్రా గ్రూపులకు రూ 3 కోట్ల మేర రివాల్వింగ్ ఫండ్ ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని సంఘాల సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు వీలుగా ఈ రివాల్వింగ్ ఫండ్ ను డ్వాక్రా సంఘాల సభ్యులు వినియోగించుకోనున్నారు.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు రూ 15 వేలు చొప్పున రివాల్వింగ్ ఫండ్ ఖరారు చేసింది. ఈ రివాల్వింగ్ ఫండ్ ద్వారా సంఘం నిధిని పెంచుకొన అవకాశం కలుగుతుంది. సంఘంలోని సభ్యుల అవసరాలకు అనుగుణంగా డ్వాక్రా సంఘం ఈ నిధుల వినియోగం పైన నిర్ణయం తీసుకుంటుంది.

ఈ ఫండ్ ద్వారా సంఘాలు తమ ఉత్పత్తుల కోసం బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ నిధులను ప్రభుత్వం త్వరలోనే సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు జిల్లాలకు సంఘాల జాబితాను పంపించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధుల ద్వారా కొత్త డ్వాక్రా సంఘాలు ఆర్దికంగా తమ బలం పెంచుకునే అవకాశం కలుగుతుంది.
కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలు తమ ఉత్పత్తులు మరింత పెంచుకునే విధంగా తోడ్పాటు అందించాలని నిర్ణయించారు. బ్యాంకర్ల సమావేశంలోనూ డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తోంది. అదే విధంగా రుణాల తిరిగి చెల్లింపు ఏపీ డ్వాక్రా సంఘాలు ముందంజలో ఉన్నాయి. రీ పేమెంట్ క్రమం తప్పకుండా ఉండటంతో బ్యాంకులు సైతం తిరిగి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.
ఇదే సమయంలో డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలోనూ ప్రభుత్వం కొత్త మార్గాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. దీంతో, ప్రభుత్వం త్వరలోనే మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications