ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు - ఆ భూములపై వారికే హక్కులు..!!

అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. 2023 జూలై 31వ తేదీ ప్రామాణికంగా 20 ఏళ్ల ముందు లబ్దిదారులకు కేటాయించిన ఎసైన్డ్ భూములను నిషిద్ద జాబితా నుంచి తప్పించనున్నారు. దీంతో 2023 జూలై 31కి ముందు లబ్దిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఎసైన్డ్ భూములపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు దఖలు పడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

20 సంవత్సరాలు దాటితే:గెజిట్‌ నోటిఫికేషషన్‌ ఇచ్చే నాటికి 20 సంవత్సరాలు ముందు పట్టాలు పొందిన వ్యవసాయభూములు, పది సంవత్సరాలు దాటిన ఇంటిస్థలాలకు భూ యాజమాన్యహక్కులు కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీంతో ఆయా భూములకు సంబందించి భవిష్యత్తులో అమ్ముకునే హక్కు, భూ బదలాయింపు చేసే హక్కు అసైన్డ్‌ పట్టాదారునికి సంక్రమించనుంది.

AP Govt issues orders on full rights over assigned lands, Removal of Inam lands from 22A

ఇదే ప్రక్రియను వేగవంతం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అసైన్డ్‌ భూములు, నివేశనస్థలాలు అసలైన లబ్ధిదారుల చేతుల్లోనే ఉన్నాయా.. పట్టాలు పొందిన లబ్దిదారులు నేటికీ ఆయా భూములపై పొజీషన్‌లో ఉన్నారా.. లేక వారి వారసుల చేతుల్లో ఎంత మేర భూములు సాగులో ఉన్నాయనే అంశాలను సర్వే నెంబర్‌ వారీగా గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అయిదు దశల్లో పరిశీలన:ఈ ప్రక్రియ మొత్తం ఐదు దశల్లో స్క్రూట్నీ చేసి తుది జాబితాను తయారు చేయాలని సిసిఎల్‌ఎ కమిషనరు సాయి ప్రసాద్‌ 26 జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఇందుకు సంబదించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న అసలైన అసైన్ట్‌ దారుడే క్షేత్రస్దాయిలో భూమిమీద ఉన్నాడా లేదా అనేది తొలుత గుర్తించనున్నారు. తొలి దశలో గ్రామ రెవెన్యూ అధికారి(విఆర్‌ఓ) భూ రికార్డుల స్వచ్చీకరణ (పిఓఎల్‌ఆర్‌) కింద రెవెన్యూ రికార్డుల్లో గుర్తించిన అసైన్డ్‌ భూముల్లో వ్యవసాయ భూములు, నివేశన స్ధలాలకు కేటాయించిన వాటి వివరాలను పరిశీలించాలి. అనంతరం గతంలో రెవెన్యూశాఖ ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలతో సరిచూసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు డికెటి రిజిస్టర్‌, 1బి అండంగల్‌, రెవెన్యూ రికార్డులును పరిశీలిస్తూ మరొక వైపు క్షేత్రస్ధాయిలో భూమి స్వరూపాన్ని పరిశీలించాలి.

సచివాలయాల్లో జాబితాలు:అసైన్డ్‌ ల్యాండ్స్‌ వివరాలు, భూ యజమానుల వివరాలను ఆయా గ్రామ,వార్డు సచివాలయాల్లోని నోటీసు బోర్డులో ప్రజలందరికీ వాస్తవ లబ్ధిదారులు ఎవరనే తెలిసే విథంగా వివరాలు నోటీసు బోర్డులో పెడతారు. ఆయా భూములకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే తెలుపుకునేందుకు ప్రభుత్వం 7 రోజులు సమయం ఇచ్చింది.

అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది జాబితాను ఆర్‌డిఓ/ సబ్‌ కలెక్టర్‌కు తహసీల్ధార్లు జాబితాను అందజేస్తారు. మూడో దశలో మండల తహసీల్ధార్లు పంపిన జాబితాలో 5శాతం రికార్డులను ర్యాండమ్‌గా ఆర్‌డిఓ, సబ్‌ కలెక్టర్‌ పరిశీలించాల్సి ఉంటుంది. నాలుగో దశలో నివేదికను జాయింట్‌ కలెక్టర్‌కు పంపుతారు. జిల్లా కలె క్టర్‌ అర్హుల జాబితాను ఆయా జిల్లా రిజిస్ట్రార్‌కు పంపడంతో పాటు జిల్లా స్ధాయిలో గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+