గ్రామ - వార్డు సచివాలయ సిబ్బందికి గుడ్ న్యూస్ - ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే..!!
గ్రామ - వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
గ్రామ - వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెలవులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. అందులోనే మరో కీలక అంశం స్పష్టం చేసారు. ఉద్యోగులు విధుల్లో చేరిన మొదటిరోజు నుంచి ఉద్యోగులకు అన్ని రకాల సెలవులు వర్తింపజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు అన్ని రకాల సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేసారు.

అందరికీ అన్ని రకాల సెలవులు
సచివాలయ ఉద్యోగులను అయిదు నెలల క్రితమే ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ అమలు చేస్తోంది. సెలవుల విషయంలో ప్రొహిబిషన్ విధానమే అమలవుతోంది. సచివాలయ ఉద్యోగులు సాధారణ, ఐచ్చిక సెలవులే వినియోగించుకుంటున్నారు. దీని పైన అభ్యర్ధనలు రావటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సెలవులు వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులతో పాటు సచివాలయ ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 7న సచివాలయాల ఉద్యోగులకు అన్ని సెలవులు వర్తింపజేయాలని సర్వీస్ రిజిస్టర్లలో నమోదు చేయాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉత్తర్వులిచ్చినప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు ఉద్యోగుల సేవా పుస్తకంలో సెలవులు మంజూరు చేయలేదు.

అప్పటి నుంచి అమలయ్యేలా నిర్ణయం
గతంలో తీసుకున్న నిర్ణయం అమలయ్యేలా ఇప్పుడు ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరడంతో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులతో ఉద్యోగులందరికీ ఎర్నడ్ లీవ్స్, సుమారు 2019 అక్టోబరు 2 నుంచి 2022 డిసెంబరు 31 వరకు (98 రోజులు), 2023 జనవరి 1 నుంచి ఈ ఏడాది డిసెంబరు 31 వరకు మరో 30 రోజులు సెలవులు జమకానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలపై ఇక నిరంతర పర్యవేక్షణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోరది. దీనికోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తోంది.
దీనిపై ఇప్పటికే పలు శాఖల అధికారులకు సూచనలు కూడా వెళ్లినట్లు తెలిసింది. సచివాలయాల్లో పనిచేసే వారు అనుసరించాల్సిన విధానాలపైనా స్పష్టతనిచ్చింది. త్వరలోనే మరికొన్ని అదనపు బాధ్యతలు కార్యదర్శులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిరది. సచివాలయాలపై మరింతగా దృష్టి సారించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే ఎంపిడిఒలకు బాధ్యతలు అప్పగించింది.

నిరంతర పర్యవేక్షణ దిశగా
సచివాలయాల పర్యవేక్షణలో భాగంగా బలోపేతమైన వ్యవస్థపై కసరత్తు ప్రారంభించిరది. ఇందులో కొంతమంది ఐఎఎస్ అధికారులను కూడా పాత్రధారులను చేసేలా ఆలోచన చేస్తున్నారు. ఖాళీగా ఉన్న 25 డివిజన్ స్థాయి అధికారుల పోస్టులను భర్తీ చేసే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించింది.
ఇప్పటికే సుస్థిరాభివృద్ధి సూచికల అమలుపై కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం తాజాగా డ్రాపౌట్స్‌ను గుర్తించే కార్యక్రమాన్ని కూడా వారికి అప్పగించాలని నిర్ణయించిరది. ప్రతి 15 రోజులకోసారి వార్డు, గ్రామ సచివాలయాలను సందర్శించే అధికారుల అధ్యయన వివరాలను నమోదుచేసేందుకు యాప్‌ను అప్‌డేట్ చేయాలని అధికారులు డిసైడ్ చేసారు. కార్యదర్శులు, శాఖాధిపతులు 15 వేల వార్డు, గ్రామ సచివాలయాల పర్యటనలను డిసెంబరు 31లోగా పూర్తి చేయాలని అధికారులు నిర్దేశించారు.












Click it and Unblock the Notifications