శ్రీశైలం కుడి గట్టు విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి .. అనుమతి కోసం కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ సర్కార్
కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ లేఖ రాసింది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జల విద్యుత్ ఉత్పత్తి అనుమతి ఇవ్వాలని లేఖ ద్వారా అభ్యర్థించింది. శ్రీశైలం ప్రాజెక్టు నిండడానికి మరో 99 టీఎంసీల నీరు అవసరమని, ఎగువ నుండి 150 టీఎంసీల వరద జలాలు వస్తున్నాయన్న అంచనాల నేపథ్యంలో కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జల విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఏపీ సర్కార్ వినతి
గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు వదిలి వేయడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదని లేఖలో పేర్కొంది. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల కొంత మేర వరద ముప్పును తగ్గించవచ్చని ఏపీ జలవనరుల శాఖ అభిప్రాయపడింది. విభజన చట్టం ప్రకారం వరద ముప్పును ఎదుర్కోవాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాలపై ఉందని పేర్కొన్న ఏపీ జలవనరుల శాఖ, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తికి తమకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
Recommended Video

లేఖ రాసిన ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి
ఈ మేరకు ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి కృష్ణా బోర్డు సభ్యులు కార్యదర్శి డి ఎం రాయ్ పురేకు లేఖ రాశారు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో 4,05,724 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 36 ,059 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టులో 863.4 అడుగులలో 116.92 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 870 అడుగులకు చేరుతున్న కారణంగా విద్యుత్ ఉత్పత్తి కి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

భారీగా వరద వస్తున్న కారణంగా విద్యుత్ ఉత్పత్తికి అనుమతి కోరుతూ లేఖ రాసిన ఏపీ
ప్రాజెక్టు ఆపరేషనల్ ప్రోటోకాల్ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎక్కువ వరద వస్తే, మిగులు జలాలను విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలి. ఈ నేపథ్యంలోనే విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుండి వస్తున్న వరదతో ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉన్న కారణంగా ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications