పవన్, లోకేష్ శాఖలకు భారీ కేటాయింపులు..!!
AP Budget 2025-26: ఏపీ ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో 2025 - 26 కాలానికి బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వంలో జరిగిన నష్టం గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తీసుకొచ్చిన మార్పులను ప్రస్తావన చేసారు. అదే సమయంలో ఆర్దికంగా ఉన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని ఆర్దికంగా గాడిన పెట్టేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఇక, డిప్యూటీ సీఎం పవన్.. లోకేష్ శాఖలకు భారీగా కేటాయింపులు జరిగాయి.
పవన్ శాఖలకు ప్రాధాన్యత
ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ బడ్జెట్ రూ.3,22,359 కోట్ల అంచనాలతో బడ్జెట్ ను ప్రతిపాదించారు. అందులో రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు గా అంచనా వేసారు. అదే విధంగా రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లుగా పేర్కొన్నారు. మూల ధన వ్యయం రూ.40,635 కోట్లు గా అంచనా వేసారు. ఇదే సమయంలో కీలక శాఖలకు కేటాయింపుల విషయంలో ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించింది. ముఖ్య శాఖలకు భారీగా కేటాయింపులు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ పర్యవేక్షిస్తున్న పంచాయి తీ రాజ్ -గ్రామీణాభివృద్ధి కి కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది.

లోకేష్ శాఖలకు
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అయిదు శాఖలను పర్యవేక్షిస్తున్నారు. పవన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసిన గ్రామీణాభివృద్ధి - పంచాయితీ రాజ్ కోసం బడ్జెట్ లో రూ 18,847 కోట్లు ప్రతిపాదించారు. కేంద్రం నుంచి ఈ శాఖల కోసం వస్తున్న సహకారం గురించి వివరించారు. పవన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల్లో వస్తున్న మార్పులను కేశవ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇక, మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న విద్యా శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. విద్యా శాఖ కు రూ 31,805 కోట్లు ప్రతిపాదించారు. ఉన్నత విద్య కోసం రూ 2,506 కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్ లో స్పష్టం చేసారు. విద్యా శాఖ పరిధిలోనే తల్లికి వందనం అమలు కోసం రూ 9.407 కోట్ల ను బడ్జెట్ కేటాయింపులు చేసారు.
శాఖల వారీగా
ప్రత్యేకంగా వ్యవసాయ అనుబంధ రంగాల కోసం రూ 13,487 కోట్లు కేటాయింపులు చేస్తూ కేశవ్ ప్రతిపాదించారు. బీసీ సంక్షేమానికి రూ.23,260 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు,
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు, జలవనరుల అభివృద్ధికి రూ.18,020 కోట్లు, మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి రూ.13,862 కోట్లు కేటాయించారు. అదే విధంగా విద్యు త్ శాఖకు రూ.13,600 కోట్లు, వ్యవసాయానికి రూ.11,636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి రూ.10, 909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు ప్రతిపాదించారు. రవాణా శాఖకు రూ.8,785 కోట్లు, ఎన్టీఆర్ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించారు.












Click it and Unblock the Notifications