అమరావతి భూములపై ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, బిగ్ టర్న్..!!

అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. అమరావతి రైతుల సమస్యల పైన సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. వారికి పూర్తిగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో మరో విడత భూ సమీకరణ తప్పదని స్పష్టం చేసారు రైతులు సహకరించాలని కోరారు. దీంతో.. ప్రభుత్వం రెండో విడత కింద 44,676 ఎకరాల లాండ్ పూలింగ్ కు కసరత్తు పూర్తి చేసింది. గ్రామాల వారీగా ఎంత సమీకరించాలో లక్ష్యాలు నిర్ణయించింది.

ఏపీ ప్రభుత్వం మరోసారి అమరావతిలో లాండ్ పూలింగ్ కు సమాయత్తం అవుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు రైతులకు ఈ విషయాన్ని స్పష్టం చేసారు. అమరావతి అభివృద్ధి చెందాలంటే 29 గ్రామాల పరిధి సరిపోదని సీఎం చంద్రబాబు అన్నారు. అదే జరిగితే ఓ మున్సిపాలిటీగా మాత్రమే అమరావతి ఉంటుందని అన్నారు. అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలని సీఎం చంద్రబాబు కోరారు. కాగా, త్వరలో ల్యాండ్ పూలింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేసేందుకు సీఆర్డీఏ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా మ‌రో 44,676 ఎక‌రాల భూ స‌మీక‌ర‌ణ దిశగా అడుగులు పడుతున్నాయి.

ap-govt-moving-for-second-phase-land-pooling-in-amaravati-for-nearly-45-thousand-acres

రెండో విడత లాండ్ పూలింగ్ తూళ్లూరు,అమ‌రావ‌తి,తాడికొండ‌,మంగ‌ళ‌గిరి మండ‌లాల్లోని గ్రామాల్లో జరగనుంది. తూళ్లూరు మండ‌లంలోని హ‌రిచంద్రాపురం,వ‌డ్డ‌మాను,పెద‌ప‌రిమి గ్రామాల్లోని 9919 ఎక‌రాలు సమీకరించాలని భావిస్తున్నారు. అమ‌రావ‌తి మండ‌లంలోని వైకుంట‌పురం,ఎండ్రాయి,కార్ల‌పూడి,మొత్త‌డాక‌,నిడ‌ముక్క‌లా గ్రామాల‌లోని..12 ,838 ఎక‌రాల్లో భూ స‌మీక‌ర‌ణ‌ జరిగే అవకాశం ఉంది. తాడికొండ‌లోని తాడికొండ‌, కంతేరు గ్రామాలలోని 16,463 ఎకరాలను భూ స‌మీక‌ర‌ణ ద్వారా సేక‌రించేలా సీఆర్డీఏ ప్రణాళికలు సిద్దం చేసింది. మంగ‌ళ‌గిరి లోని కాజా గ్రామంలోని 4492 ఎక‌రాల‌ను భూ స‌మీక‌ర‌ణ ద్వార సేక‌ర‌ణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక.. ఆయా గ్రామాల్లో భూ స‌మీక‌ర‌ణ కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న సీఆర్డిఏ త్వరలో జారీ చేసేందుకు నిర్ణయించారు. ఇప్ప‌టికే రాజ‌ధాని లోని 29 గ్రామాల్లోని 34 వేల ఎక‌రాలు మేర ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సమీకరించారు. ఇక.. అమ‌రావ‌తి అవుట‌ర్ రింగ్ రోడ్డు కు ఇన్న‌ర్ రింగ్ రోడ్ కు మ‌ధ్య‌లోని భూముల‌ను సేక‌రించ‌నున్నారు. ఈ భూముల్లో అమ‌రావ‌తికి ఎయిర్ పోర్ట్, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, అవుట‌ర్ రింగ్ రోడ్డు, ఎర్రుపాలేం నుండి అమ‌రావ‌తికి వ‌ర‌కు కొత్త‌గా వేయ‌నున్న రైల్వే లైన్ కోసం వినియోగించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎంతో సమావేశం సమయంలోనూ రైతులు ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆంగీకారం తెలిపారు. దీంతో.. రెండ విడత లాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+